Saturday, 9 March 2024

అమ్మ ప్రేమ అమృతం

 నా వయసు 30 సంవత్సరాలు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను పాపకు నాలుగు నెలలు నిండాయి మిటర్నిటీ లీవ్ కాలపరిమితి ముగియడంతో తిరిగి విధులలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది పాప బాగోగులు చూసుకునేందుకు మా అత్తగారు వచ్చారు ఆమె వయసులో పెద్దవిడ పిల్లల పెంపకంలో అనుభవం ఉన్నప్పటికీ నాకు కంగారుగానే ఉంది పాప నన్ను మిస్ అవుతుందని తనతో ఎక్కువ సమయం గడపకపోతే నాకు దగ్గర అవ్వదేమో అని భయంగా ఉంది ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారు



మాతృత్వ మాధుర్యం అనుభూతి చెందుతున్న ప్రతి అమ్మలోనూ ఇలాంటి అనుమానాలు రేకెత్తడం సహజం నాలుగు నెలలుగా పాపతోనే ఉండడం వలన తనను వదిలి ఆఫీసుకు వెళ్లడానికి మీకు ధైర్యం సరిపోవడం లేదు మీ అత్తగారు బాగా చూసుకుంటారని తెలిసిన బుజ్జాయిని వదిలి ఉండడానికి మీ అంతరాత్మ అంగీకరించడం లేదు ముఖ్యమైన విషయం ఏమిటంటే పొద్దంతా తన దగ్గర లేకపోతే చిన్నారి మీకు దూరం అవుతుందన్నది కేవలం మీ అపోహ మాత్రమే పాపతో మీది రక్తసంబంధం ఒక పూట దగ్గర లేనంత మాత్రాన ఏదో జరిగిపోతుందని కంగారు పడవద్దు ఎవరు ఎంత దగ్గర చేసినా అమ్మ ఆప్యాయతను మించింది ఉండదు అవకాశం ఉంటే ₹10,000 తగ్గించుకొని ప్రయత్నం చేయండి కొన్నాళ్లు రిమోట్ వర్క్ కానీ హైబ్రిడ్ వర్క్ ఆప్షన్ కానీ ఇవ్వమని కోరండి అందుకు అవకాశం లేకపోతే మీ ఆఫీసుకు దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రయాణ సమయం కూడా కలిసి వస్తుంది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి ఇంట్లో ఉన్న సమయం పాపతో గడపడానికి ప్రాధాన్యం ఇవ్వండి పాపకు ఏడాది వయసు వచ్చేదాకా అందుబాటులో ఉన్న సెలవులను వాడుకోండి


No comments:

Post a Comment