మనుషుల్లాగే బిడ్డ మరణం అని ఏమాత్రం తట్టుకోలేవు మరణించిన పిల్ల ఏనుగు ముందు గట్టిగా ఏడుస్తాయి మనుషులకు చేసినట్లే అంత్యక్రియలు నిర్వహిస్తాయి గొయ్యి తీసి పోడ్చి తర్వాత నీటిలో స్నానాలు చేస్తాయి
భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్లే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో తేలింది మనుషులు చేసినట్లే చనిపోయిన పిల్ల ఏనుగుల మృతదేహాలకు పద్ధతి ప్రకారం ఏనుగులు అంత్యక్రియలను నిర్వహిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు ఈ మేరకు 2022 2023లో బెంగాల్లో ఉండే 15 నుండి 2 ఏనుగులకు సంబంధించి ఐదు కేసులను విశ్లేషించినట్లు అధ్యయనంలో భాగమైన ఐఎఫ్ఎస్సి అధికారి ప్రవీణ్ కళ్యాణ్ ఆకాశదీప్ రాయి పేర్కొన్నారు ఈ వివరాలు త్రెటైండ్ టాక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి
అంత్యక్రియలు ఇలా
చనిపోయిన బిడ్డ ఏనుగును చూసిన తల్లి ఏనుగు తండ్రి ఏనుగు ఆ మృతదేహాన్ని తొండం ముందరి కాళ్ళతో నెమ్మదిగా తడుముతూ గట్టిగా రోదిస్తాయని పరిశోధకులు తెలిపారు ఆ తర్వాత మానవ సంచారం లేని ప్రాంతానికి ఆ బిడ్డ మృతదేహాన్ని తొండం సహాయంతో ఏనుగుల గుంపు తరలిస్తుంది పొలాలు లేదా టిఎస్టి లేదా కాలువ గట్టున ఉన్న నిర్మాణస్యమైన చదువునైనా ప్రాంతంలో గోతిని తవ్వి పిల్ల ఏనుగు ముందరి కాళ్లు పైకి కనిపించేలా ఉంచి నెమ్మదిగా కప్పి పెడుతుంది ఆ తర్వాత దగ్గరలోని నీటిలో ఏనుగుల గుంపు స్నానాలు ఆచరిస్తాయి పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన ప్రాంతానికి ఇంకెప్పుడూ ఆ గుంపు రాబోదని పరిశోధకుల బృందం తెలిపింది మరణించిన పిల్ల ఏనుగుల విషయంలోని ఏనుగులు ఈ క్రతువులు జరుపుతాయని పెద్ద ఏనుగుల విషయంలో జరిపినట్లు ఆధారాలు లేవని వెల్లడించింది పెద్ద ఏనుగును తరలించడం పోడ్చడం కష్టమైన పని కావడమే దీనికి కారణమై ఉండవచ్చని అభిప్రాయపడింది
No comments:
Post a Comment