ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో గుర్తింపు
సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అనేది ఇంత కాలంగా భౌతిక శాస్త్రంలో ఉన్న ప్రాథమిక సిద్ధాంతం అయితే ఇప్పుడు యూకే లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు సిద్ధాంతం తప్పని రుజువు చేస్తున్నారు తాజాగా వీరు చేసిన ఒక అధ్యయనంలో ద్రావకంలో ఒకే రకంగా చార్జ్ చేసిన సజాతి కణాలు కూడా పరస్పరం ఆకర్షిస్తాయని తేలింది ద్రావకం స్వభావం ఆమ్లత్వాన్ని బట్టి ఇది ఉంటుందని పరిశోధకులు గుర్తించారు నీటిలో విజాతి కణాలు సమూహంగా ఏర్పడితే ఇతనాల్లో మాత్రం సజాతి కణాలు సమూహంగా ఏర్పడుతున్నట్లు పరిశోధకులు తేల్చారు ఈ అధ్యయన వివరాలు నేచర్ నానో టెక్నాలజీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి
No comments:
Post a Comment