Tuesday, 5 March 2024

పెద్దవాళ్లు స్పృహ కోల్పోతే ఏం చేయాలి

 అది ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొడుకు కోడలు ఆఫీసులకు పిల్లలు స్కూలుకు వెళ్లారు ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరే ఉన్నారు. అంతలో కూర్చులో కూర్చుని ఉన్న ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కూలబడిపోయారు ఆమె కంగారుపడి ఏడుస్తూనే సహాయం కోసం ఎదురింటికి వెళ్లారు తలుపు తాళం వేసి ఉంది ఆ పక్క ఫ్లాట్లోనూ ఇదే పరిస్థితి ఏం చేయాలో తెలియక ఆదుర్గపడుతూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నారు అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నారు కానీ జరిగిన ఘటన ఆమె మనసులో మెదులుతూనే ఉంది మనిషి మామూలు స్థితికి వచ్చారు కాబట్టి సరిపోయింది అనుకోనిది ఏదైనా జరిగితే భయం వెంటాడుతూనే ఉంది ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరికైనా గాబరా తప్పదు ఇంతకీ ఇదేం సమస్య అంటే దీనిని తాత్కాలికంగా స్పృహ తప్పడం అంటారు ఇది ఏ వయసు వారికైనా రావచ్చు కానీ పెద్ద వయసులో ఎక్కువగా చూస్తుంటాము దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి అందువల్ల సింకోపీకి కారణాలు ఏమిటి ఎలా ఎదుర్కోవాలి అనేది తెలుసుకొని ఉండటం మంచిది. పెద్దవాళ్లు స్పృహ తప్పిపోయినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స

ఉన్నట్టుండి ఎవరైనా స్పృహ తప్పితే పక్కన ఉన్న వారికి కాలు చేయి ఆడదు. అలాగని గాబరా పడితే లాభం లేదు తక్షణం కొన్ని సపర్యాలు చేయడం మంచిది. స్పృహ తప్పిన వారిని వెళ్లకిలా పడుకోబెట్టాలి మెడ ఒక పక్కకు తిప్పాలి దుస్తులను వదులు చేయాలి నాడీ ఎలా ఉందో చూడాలి. బాగా నిదానంగా గాని చాలా వేగంగా గాని కొట్టుకుంటుంటే గుండెకు సంబంధించిన సమస్య కారణం కావచ్చని అనుమానించాలి వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి లేదా ఆసుపత్రికి తీసుకెళ్లాలి స్పృహలోంచి తీరుకున్నాక మాట నందిగా వస్తున్న నోరు సొట్ట పోయిన చేయి కాలు చేర్చబడినట్లు అనిపించిన ఆలస్యం చేయొద్దు తక్షణ ఆసుపత్రికి తీసుకెళ్లాలి రక్తంలో గ్లూకోజు పడిపోవడం వలన స్పృహ తప్పిన వారికి ముందుగా నోరు తెరిచి రెండు చెంచాల గ్లూకోజు లేదా పంచదార వేయాలి దీనితో గ్లూకోస్ మోతాదులు పెరిగి కోలుకుంటారు అయితే గ్లూకోజ్ నీళ్లు పంచదార నీళ్ళు కూల్డ్రింకుల వంటివి నోట్లో పోయొద్దు ఇవి మింగుడు పడకపోయినా పూలమారిన ఊపిరితిత్తుల్లోకి పోయే ప్రమాదం ఉంది

తీసుకోవలసిన జాగ్రత్తలు

సాధారణంగా పెద్ద వయసులో స్పృహ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని నివారించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది

నిద్రపరంగా ఒక్కసారిగా మంచం మీద నుంచి లేవద్దు పడక గదిలో తప్పనిసరిగా బెడ్ లైట్ వేసి ఉంచాలి. మంచం మీద నుంచి లేచినప్పుడు అవసరమైతే చేతి కర్ర సహాయం తీసుకోవాలి

స్నానం చేసేటప్పుడు స్నానాల గది దలుపు తలుపు బోల్ట్ వేయొద్దు తలుపు మీద దువాలు వేస్తే లోపల ఎవరో ఉన్నట్లు బయట వారికి తెలుస్తుంది చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే రక్తనాళాలు వ్యాకోచించి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి తలస్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ముఖానికి సబరుద్దుకుంటాం కదా ఇలాంటి అప్పుడు తూలిపోయే స్పృహ కోల్పోవచ్చు

రక్త ప్రసరణ విషయంలో పెద్ద వయసులో మోకాలి కింది వరకు సాక్స్ ధరించవచ్చు ఎలాస్టిక్ బాండేజీని మరీ బిగుతుగా కాకుండా కట్టుకోవచ్చు అంగుళం వెడల్పు గల పొడవాటి వస్త్రాన్నైనా చుట్టుకోవచ్చు

బయటకు వెళ్లేటప్పుడు బాగా ఎండ కాస్తున్నప్పుడు బయటకు వెళ్ళవద్దు వేడికి చర్మంలో ఉన్న రక్తనాళాలు వ్యాకోచించి మెదడుకు రక్త సరఫరా తాగి స్పృహ కోల్పోవచ్చు గొడుగు వేసుకుంటే మంచిది. మందులు వేసుకుంటుంటే మతిమరుపు మూలంగా పొరపాటున ఎక్కువసార్లు మందులు వేసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా గ్లూకోజు రక్తపోటు తగ్గించే మాత్రల విషయంలో మరింత జాగ్రత్త అవసరం

ముఖ్యమైన విషయం ఇంట్లో పెద్ద వయసు వారికి స్పృహ తప్పితే కుర్చీలో కూర్చుని ఉన్నట్లయితే కాళ్ళను మోకాళ్ళ దగ్గరికి మడిచి రెండు మోకాళ్ళ మధ్యలో తలను ఉంచాలి. అలాగే వీలుంటే వెల్లకిలా పడుకోబెట్టాలి నోటిలో పంచదార లేదా గ్లూకోజు వేయాలి నీరు త్రాగితే ప్రయత్నం చేయవద్దు



No comments:

Post a Comment