Saturday, 2 March 2024

లక్క గాజులకు జిఐ నగిషీ

 హైదరాబాద్ నగరానికి మరొక గుర్తింపు దక్కింది పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ జి ఐ గుర్తింపు లభించింది ఇదివరకే హైదరాబాద్ హలీంకు జిఐ ట్యాగ్ దక్కగా తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్ లార్డ్ బజార్ లాక్ గాజులను తెలుగులో లక్కరాళ్ళ గాజులుగా పిలుస్తుంటారు తాజాగా ఈ లెక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జిఐ రిజిస్ట్రీ శనివారం సీఐ రిజిస్ట్రేషన్ ట్యాగ్ను ప్రకటించింది తెలంగాణలో జిఐ ట్యాగ్ అందుకున్న 17వ ఉత్పత్తి ఇది

హైదరాబాద్ పాత బస్తి గాజులకు ప్రసిద్ధి ఇక్కడ రకరకాల గాజులు తయారవుతుంటాయి అందులో లక్కరాళ్ళ గాజులు స్థానిక అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందాయి ఈ గాజుల తయారీ క్లిష్టమైన ప్రక్రియ రేసింగ్ కొలిమిపై కరిగిస్తే లెక్క వస్తుంది. దీనిని వృత్తాకారంలో మరిచి దానిపై స్పటికాలు రాళ్లు పూసలు అద్దాలను హస్త కళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు కార్యక్రమంలో వీటి డిజైన్లలో ఎన్నో మార్పులు వచ్చాయి మొగలుల కాలంలో ఈ కళ ఉబ్బరించిందని చెబుతారు



రాజ కుటుంబాలలోని మహిళలు ఈ గాజులు ధరించేవారు ఇప్పుడు వేడుకలలో వీటిని ధరించడానికి మహిళలు ఇష్టపడుతున్నారు ల్యాండ్ బజార్లో మాత్రమే దొరికే లక్క గాజులకు జిఐ గుర్తింపు కోసం 2022లో ప్రెసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది 18 నెలల పరిశీలన అనంతరం జిఐ ట్యాగ్ మంజూర అయింది త్వరలోను ధ్రువీకరణ పత్రం రానున్నది లాక్ గాజుల తయారీలో 6000 కుటుంబాలు పాలుపంచుకుంటున్నాయి జిఐ ట్యాగ్ వీరందరికీ గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తుంది మంచి డిజైన్లను రూపొందించడానికి కొత్తవి తయారు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మార్కెట్లో గాజులకు డిమాండ్ తో పాటు అమ్మకాలు పెరిగి హస్త కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది అని ఆర్టిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఇసాముద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు

No comments:

Post a Comment