Thursday, 7 March 2024

గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి

 నగలు కడ్డీలు నాణేలు తదితర భౌతిక బంగారానికి చట్టబద్ధ పత్ర రూపమే ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని జారీ చేస్తుంది కాబట్టి అత్యంత సురక్షితమైన పెట్టుబడులుగా వీటిని పేర్కొనవచ్చు ఈ బాండ్లకు 8 ఏళ్ల లాకింగ్ పీరియడ్ ఉంటుంది అయినప్పటికీ ఐదేళ్ల తర్వాత నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుంటుంది సెకండరీ మార్కెట్లో అప్పటి గోల్డ్ రేట్ ప్రకారం తిరిగి అమ్ముకోవచ్చు బ్యాంకులు, కొన్ని పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఈ బాండ్లను కొనుక్కోవచ్చు. బాంబే స్టాక్ చేంజ్ నేషనల్ స్టాక్ చేంజ్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లు కూడా విక్రయిస్తాయి ఇక బాండ్ల ధరను వాటిని జారీ చేయడానికి ముందున్న మూడు రోజుల 24 క్యారెట్ బంగారం ముగింపు ధర భారతీయ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్దేశించిన రేట్లు ల సగటు ఆధారంగా నిర్ణయిస్తారు 2.5% వార్షిక కూపన్ వడ్డీ రేటు ఉంటుంది మధుపర్లకు ఆరు నెలలకు ఒకసారి దీని ప్రకారం చెల్లింపులు జరుగుతాయి కాగా ఇండివిజువల్స్ హిందూ అవిభాజ్య కుటుంబాలకైతే గ్రాము నుంచి నాలుగు కిలోల దాకా సంస్థలు ట్రస్టులకైతే గరిష్టంగా 20 కిలోల వరకు పెట్టుబడికి అవకాశం ఉంటుంది బాండ్ కున్న మార్కెట్ విలువలో 75% వరకు రుణంగా పొందవచ్చు బాండ్లను పూర్తికాల పరిమితైన ఎనిమిదేళ్లు ఉంచుకుంటే ఆ తర్వాత వచ్చే దానిపై క్యాపిటల్ గేయిన్స్ టాక్స్ ఉండదు. అయితే ఈ ఎనిమిదేళ్ల కాలంలో వాయిదాలలో పొందే వడ్డీ ఆదాయంపై మాత్రం పన్ను పడుతుంది. మీ మీ ఆదాయ పన్ను స్లాబుల ప్రకారం ఇది వర్తిస్తుంది

No comments:

Post a Comment