Saturday, 2 March 2024

ఎండలో బయటకు వెళ్తున్నారా

 రోజురోజుకు పెరుగుతున్న ఎండలలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు ఆ జాగ్రత్తలు ఇవే

సమయానికి ఆహారం తీసుకోవాలి రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి ఎండలో ఉద్యోగాలకు ఆటలకు వెళ్లే వారైతే మరో లీటర్ అదనంగా తీసుకోవాలి. అంటే చెమట రూపంలో శరీరం శరీరం నుంచి బయటకు పోయే నీటిని తిరిగి శరీరానికి అందించాలన్నమాట దానివల్ల హైడ్రేషన్ సాధారణ స్థాయిలో ఉంటుంది బయటకు వెళ్లేవారు నల్ల కళ్ళద్దాలు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి. పదులైన కాటన్ దుస్తులు తరించాలి టైట్ గా ఉండే జీన్స్ పాలిస్టర్ లాంటి దుస్తులకు సాధ్యమైనంత వరకు వేసవిలో దూరంగా ఉంటే మేలు అలాగే చాలామంది ఎండలో నుంచి ఇంటికి రాగానే స్నానం చేయడం లేదంటే చల్లనిల్లతో ముఖం కడుక్కోవడం ఫ్రిజ్లో నుంచి నీళ్లు తీసుకుని తాగడం చేస్తుంటారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి అలా కాకుండా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలో మార్పు వస్తే శరీరం దానిని తట్టుకోలేదు తలనొప్పి జ్వరం గొంతులో మంట లాంటి సమస్యలు వస్తాయి బలహీనంగా సున్నితంగా ఉన్నవారికైతే ఒక్కోసారి ప్రాణానికి ప్రమాదం ఉంచుకోవచ్చు కనుక ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే శరీరం సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు రెండు మూడు నిమిషాలు విశ్రాంతినివ్వాలి ఆ తర్వాతనే నీళ్లు తాగడం గాని ముఖం కడుక్కోవడం కానీ చేయాలి అదేవిధంగా గంటల తరబడి ఏసీలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లడం కూడా సమస్యలను తెచ్చుకోవడమే క్రమంగా వేసిన తగ్గించుకొని కాసేపు ఏ బాల్కనీలో ఉండి అప్పుడు బయటకు వెళ్లాలి

No comments:

Post a Comment