Saturday, 2 March 2024

ఆధ్యాత్మిక వార్తలు మార్చి 2 2024

 రేపు సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

మద్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రకాష్ తెలిపారు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరారు వచ్చిన భక్తుల కోసం అన్నదానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సూచించారు

వైభవంగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవము

మద్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం భక్తులు వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గణపతి నవగ్రహ పూజ అమ్మవారికి ప్రత్యేక మహాభిషేకము కుంకుమ పూజ పేద పండితుల మంత్రోచ్ఛారణలతో యాగం నిర్వహించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు మహారాష్ట్రకు చెందిన భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

బిచ్కుందలో స్థానిక రంగర్ గల్లీలోని మహాలక్ష్మి ఆలయ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యాలు సమర్పించారు అనంతరం అన్నదానం చేశారు

శివరాత్రి వేడుకలకు ఆహ్వానము తాండూరు గ్రామంలోని సుప్రసిద్ధ త్రిలింగ రామేశ్వర ఆలయంలో నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ ఎస్పీ సింధు శర్మ గార్లను శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు ఎంపీపీ రాజదాసు సొసైటీ చైర్మన్ ఆర్కిడి గంగారెడ్డి సభ్యులు రమేష్ సాయిలు రాజశేఖర్ తదితరులు ఉన్నారు

తెలంగాణ తిరుమల దేవస్థానంలో శుక్రవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు నాయకులు సాయికిరణ్ పోచిగుండా యోగేశ్వర రాజు తదితరులు ఉన్నారు

మహమ్మద్ నగర్ మండలం హసన్పల్లి గ్రామ శివారులోని పటేల్ చెరువు మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి శుక్రవారం బోనాలు నిర్వహించారు పట్టు వస్త్రాలు పూలదండలు నైవేద్యాలు సమర్పించి మోక్కులు తీర్చుకున్నారు

బారడి పోచమ్మ పండుగ చించోలిలో శుక్రవారం భారతి పోచమ్మ పండుగను గ్రామస్తులు నిర్వహించారు స్థానిక హనుమాన్ ఆలయం నుంచి మహిళలు బోనాలు మంగళహారతులతో ఊరేగింపు చేపట్టారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు గ్రామ ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు





No comments:

Post a Comment