ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును మరొకసారి పొడిగిస్తున్నట్లు ఉడాయి తెలిపింది ఈ ప్రక్రియను కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుండగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు గుడాయి ఎక్స్ లో పోస్ట్ చేసింది దీంతో జూన్ 14 వరకు ఆధార్ లో ఉచితంగా మార్పులు చేసుకోవచ్చు తొలిత 2023 మార్చి 15 వరకు ఉన్న గడువును డిసెంబర్ 14 వరకు పొడిగించారు తర్వాత 2024 మార్చి 14 దాకా అవకాశం కల్పించారు తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటనలో పేర్కొంది ఆధార్ తీసుకొని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రాఫిక్స్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఉడాయి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక లేటెస్ట్ గుర్తింపు కార్డు చిరునామా వివరాలను సమర్పించాలి రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ ఫోటో పాస్బుక్ పాస్పోర్ట్ వంటివి గుర్తింపు చిరునామా రెండింటికి ధ్రువీకరణ పత్రాలుగా వాడుకోవచ్చు టిసి మార్క్ షీట్ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది
No comments:
Post a Comment