Friday, 1 March 2024

గుడ్లు ఎన్నో రకాలు

 



ప్రస్తుతం మార్కెట్లో గుడ్లు ఎన్నో రకాలుగా అందుబాటులో ఉన్నాయి ఒమేగాత్రి డే విటమిన్ కారిడియో అంటూ రకరకాల పేర్లతో ఎగ్స్ కనిపిస్తున్నాయి పౌల్ట్రీ గుడ్లు తెలుసు నాటుకోడి గుడ్లు తిన్నాము కానీ ఇన్ని రకాల గుడ్లు ఎలా ఉన్నాయంటే..

రోజు ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి డోకా ఉండదని చాలామంది చెబుతుంటారు విటమిన్లు క్యాల్షియం ఒమేగాత్రి ఫ్యాటీ ఆమ్లాలతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుందన్నమాట నిజమే మరైతే పోషకాల నిలయంగా చెప్పే గుడ్డులోని అదనంగా ఇలాంటి విటమిన్ లను జత చేస్తే ఒక్క ఎగ్గుతోనే ఎంతో బలం వస్తుంది కదా అనుకున్న ఉత్పత్తిదారులు బోలెడన్ని వెరైటీ ఎగ్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు మార్కెట్లో నాటుకోడి గుడ్లు, పౌల్ట్రీ కోడిగుడ్లు ఎప్పటినుంచో ఉన్నాయి తర్వాత సేంద్రియ కోడిగుడ్ల లాంటిది అందుబాటులోకి వచ్చాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే కోడిగుడ్డు విలువ అందరికీ అర్థమైపోయింది ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ఇళ్లలో అల్పాహారంలో దీనిని భాగం చేశారు ఆరోగ్యానికి కోడిగుడ్డుకి ఉన్న ఈ బలమైన బంధం వల్లే ఇప్పుడు మరికొన్ని కొత్త రకాల గుడ్లు వస్తున్నాయి

ఎన్నెన్ని రకాలు. . కోళ్లకు పెట్టే ఆహారంలోనే రకరకాల మార్పులు చేస్తూ విటమిన్-డి విటమిన్ ఈ ఒమేగాత్రి విటమిన్ ప్లస్ ఎగ్స్ ఇంకా అన్ని రకాల విటమిన్లు కాపర్ లాంటి ఖనిజాలు ఉండే ఇమ్యూనిటీ బూస్టర్ గుడ్లను తయారు చేస్తున్నారు ఉదాహరణకు కోళ్లకు అవిస గింజల లాంటి ఒమేగాత్రి ఫ్యాటీ ఆమ్లాలు ఇచ్చే పదార్థాలతో ప్రత్యేకమైన డైట్ ఇస్తూ ఒమేగాత్రి ఎగ్స్ ను తయారుచేస్తారు కేవలం శాఖాహార అందిస్తూ వెజిటేరియన్ ఎగ్స్ ని ఉత్పత్తి చేస్తారు ఒక్కోరకమైన గుడ్డు కోసం కోళ్లకు పెట్టే దానాలు మార్పులు చేస్తూ ఒక్కో డైట్ ని డిజైన్ చేస్తారన్నమాట

సాధారణంగా గుడ్డులో ప్రోటీన్ అమైను ఆమ్లాలు బి కాంప్లెక్స్ విటమిన్లు డి విటమిన్ ఇతర ఖనిజాలు ఉంటాయి కానీ వీటికి అదనంగా పోషకాలను కలుపుతూ ఈ కష్టమైజ్డ్ ఎగ్స్ ని తయారు చేస్తున్నారు విటమిన్ ల గుడ్లు మాత్రమే కాదండోయ్ డయాబెటిక్స్ కి ప్రత్యేకంగా రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరిచే క్రోమియం ఖనిజాన్ని చేర్చుతూ దయాబెట్ ఎగ్స్ ను తక్కువ కొవ్వు ఎక్కువ ప్రోటీన్లతో ఉండే కారుడియో ఎగ్స్ ను ఫిట్నెస్ ట్రిక్స్ కోసం ప్రోటీన్ బ్రౌన్ ఎగ్స్ ను తీసుకొచ్చారు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ చిన్నారుల ఎదుగుదలకు అవసరమయ్యే విటమిన్లు ఖనిజాలు ఇవ్వాలనుకుంటే సాధారణ కోడిగుడ్డుకు బదులు ప్రత్యేకమైన ఈ పోషకాల గుడ్లను ట్రై చేసి చూడవచ్చు తమ తమ అవసరాలను బట్టి పెద్దవాళ్ళు వీటిని తినవచ్చు


No comments:

Post a Comment