సదాశివ నగర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి రజక సంఘం ఆధ్వర్యంలో మడేల్ అయ్యాకు నిర్వహించిన బోనాల ఊరేగింపు వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో రజక ఐక్యవేదిక ప్రతినిధులు పున్నం రాజయ్య దుబ్బాక ఆశన్న గుర్తింపు నరసింహులు తదితరులు పాల్గొన్నారు
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బీర్కూరు మండలం తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప పాల్గొన్నారు మొదటి రజు లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి నవమ వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పరీక్ష అంబురెడ్డి ఆలయ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు నరసరాజు అప్పారావు పాల్గొన్నారు
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు పట్టణంలోని కోటగల్లి కోట దుర్గమ్మ ఆలయం మొదటి వార్షికోత్సవంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్పమ్మతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ కోట దుర్గమ్మ ఆలయ నిర్మాణానికి 30 లక్షల రూపాయల నీతులు అందించామని తెలిపారు ఎమ్మెల్యే దంపతులను సన్మానించి అమ్మవారి ఫోటోలు మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో 19వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే పోచారం కోరారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్ రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి మండల నాయకులు శ్రీధర్ నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ కౌన్సిలర్లు పాల్గొన్నార
పాదయాత్రకు ఘన స్వాగతం గుడిమెట్ మహాదేవ్ మహారాజ్ స్వామీజీ ఆధ్వర్యంలో నుంచి చేపట్టిన మహాపాదయాత్ర గురువారం గాంధానికి చేరుకున్నది ఈ సందర్భంగా భక్తులు భజన చేస్తూ పాటలు పాడుతూ ఘన స్వాగతం పలికారు పాదయాత్ర భక్తులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సోమేశ్వరాలయానికి ఈనెల 22వ తేదీన చేరుకుంటుందని భక్తులు తెలిపారు

No comments:
Post a Comment