నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన చరిత్ర జిజ్ఞాసి విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు కాలమిస్ట్ చరిత్రకారుడు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు బాల్కొండ చరిత్ర రాయబోని 2014 నుండి 2023 వరకు దశాబ్ద కాలం పాటు బాల్కొండలోని చారిత్రాత్మక ఖిల్లా ను ప్రధానాధారంగా చేసుకొని పట్టణంలోని ప్రాచీన దేవాలయాలు జిల్లాలోని శివాలయం సమీపంలో గల శాసనాన్ని ఇత్యాధి చరిత్ర అంశాల్ని పరిశీలించి పరిశోధించి సరైన ఆధారాలు సంపాదించి చారిత్రాత్మక అన్నయ్య కొండయ్యల శిలా విగ్రహాలు బాల్కొండ కోట బురుజులు, ముఖద్వారాలు ఫిరంగి లాంటి వాటిని ఎంతో ఆసక్తితో నరసింహారావుతో పాటు చరిత్ర పరిశోధకులు కందకుర్తి యాదవరావు సిద్దసాయారెడ్డి కంకణాల రాజేశ్వర సంపూర్ణ సహకారంతో అల్లకొండ ఊరు ఉద్భవం అయిదు ఆలయాలకు ప్రసిద్ధి పేరుతో వ్రాసిన బాల్కొండ చరిత్ర గ్రంథాన్ని మొదటగా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆవిష్కరించనున్నట్లు అస్మక చరిత్ర పరిశోధక మండలి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ శనివారం మీడియా ద్వారా ఒక ప్రకటనలు తెలిపారు ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ రాజన్ ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంధావిష్కరణ చేస్తారన్నారు విశిష్ట అతిథిగా మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరుకానున్నారన తెలిపారు కార్యక్రమాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి చరిత్ర పరిశోధకులు చరిత్రకారులు సాహితీవేత్తలు చరిత్ర అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కంకణాల రాజేశ్వర్ కోరారు
No comments:
Post a Comment