అడవిలో అద్భుతం దట్టమైన అడవి ప్రాంతము పక్షుల కిలకిల రావాలు జంతువులు అరుపులు నెమలి నాట్యాలు మాకూరు మండలంలోని చిన్నాపూరు శివారులో 63వ జాతీయ రహదారి పక్కన అరణ్య అర్బన్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు కనివిందు చేస్తోంది నిజామాబాదుకు ఐకానిక్గా నిలుస్తుంది పచ్చని వృక్షాలు పక్షుల కిలకిల రావాలి అందమైన కుందేళ్ళు చెంగుచెంగున ఎగిరే జింకలు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం అటవీ శాఖ కల్పిస్తోంది ఈ పార్కు సుమారు 413 ఎకరాల విస్తీర్ణంలో ఐదు కిలోమీటర్ల సరిహద్దు కలిగి 13 కోట్లతో అభివృద్ధి చేశారు పిల్లలకు పది రూపాయలు పెద్దలకు 20 రూపాయల టికెట్ అందుబాటులోకి అటవీశాఖ ఉంచింది స్కూల్ పిల్లలకు స్టడీ టూర్ లాగా కూడా ఉపయోగకరంగా ఉంది ప్రధాన ద్వారం నుండి అడవిలోకి వెళ్లేందుకు మూడు ద్వారాలు ఏర్పాటు చేశారు పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నపిల్లలకు ఆడుకునేందుకు వీలుగా పార్క్ అక్కడక్కడ సేద తీరేందుకు ఫుడ్ టైప్ సిమెంటుతో తయారీ కుర్చీలు టేబుల్స్ ఏర్పాటు చేశారు పర్యాటకుల సౌకర్యార్థం నీటి వసతి ట్యాంకులు నిర్మించారు ఓపెన్ గ్లాస్ రూమ్ వాచ్ టవర్ అందంగా ఏర్పాటు చేశారు ఆకట్టుకునే విద్యుత్ దీపాలు బండరాళ్లతో అందంగా నిర్మాణాలు నిర్మించారు త్వరలోనే సఫారీ సైకిల్ అందుబాటులోకి తీస్తామన్నారు మార్కింగ్ వాకర్స్ పచ్చని వృక్షాల మధ్య యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్క్ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వచ్చే వేసవిలో పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు


No comments:
Post a Comment