Friday, 15 March 2024

ఘనంగా ఆధ్యాత్మిక సమ్మేళనం

 కనహలో యోగా తరగతులు ప్రారంభం వీనుల విందుగా శంకర్ మహదేవన్ సంగీత కచేరి

ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన కన్హ శాంతి వనంలో ఆధ్యాత్మిక సమ్మేళనా కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్ ఫుల్నే సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి హార్ట్ ఫుల్నే సంస్థ గురూజీ కమలేష్ డి పటేల్ ఆధ్వర్యంలో యోగ తరగతులు నిర్వహించారు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత కచేరితో ఆకట్టుకున్నారు కుమారేశ్ రాజగోపాల్ శశాంక్ సుబ్రహ్మణ్యం అద్భుతమైన సంగీతాన్ని అందించారు ప్రపంచంలోని సర్వ మతాలు విశ్వాసాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒకే చోటిక చేర్చడం అంతర్గత శాంతి నుంచి ప్రపంచ శాంతికి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు



No comments:

Post a Comment