మౌర్యుల పరిపాలన కాలంలో చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా రాజనీతిజ్ఞుడిగా ఆర్థికవేత్తగా భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా అంటారు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం జీవితం అనే అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు వీటిని సువర్ణ అక్షరాలుగా భావిస్తారు ఆ సూత్రాలలో కొన్ని
ఏ వ్యక్తి అయినా చాలా నిజాయితీగా ఉండకూడదు నిటారుగా ఉన్న చెట్లని మొదట నరికి వేస్తారు అలాగే నిజాయితీపరులే మొదట బాధితులు అవుతారు
పని మొదలుపెట్టేముందు నిన్ను నువ్వు మూడు ప్రశ్నలు వేసుకో నేను ఇది ఎందుకు చేస్తున్నాను ఫలితాలు ఎలా ఉండవచ్చు నేను విజయం సాధిస్తానా ఈ ప్రశ్నలను లోతుగా ఆలోచించి సంతృప్తికర సమాధానం లభించినప్పుడే ముందుకు సాగు అని కౌటిల్యుడు చెప్పాడు.
మనిషి పుట్టుకతో కాదు తాను చేసే పనుల వల్ల గొప్పవాడు అవుతాడు
అతిపెద్ద గురు మంత్రం మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు అది మిమ్మల్ని నాశనం చేస్తుంది
ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి యవ్వనం స్త్రీ అందం
భయం నీ చింతకు వచ్చినప్పుడు దానిపై దాడి చెయ్యి దాన్ని నాశనం చెయ్యి అని చానక్యుడు ధైర్యం చెప్పాడు
మొదటి అయిదు సంవత్సరాలు మీ పిల్లవాడిని డార్లింగ్ లాగా చూసుకోండి తర్వాత ఐదేళ్లపాటు వాళ్ళని తిట్టండి 16 ఏళ్లు వచ్చేసరికి వారిని స్నేహితుడిగా చూసుకోండి మీ ఎదిగిన పిల్లలు మీకు మంచి స్నేహితులవుతారు
విద్యా మంచి స్నేహితుడు చదువుకున్న వ్యక్తిని ప్రతి చోట గౌరవిస్తారు విద్య అందాన్ని యవ్వనాన్ని ఓడిస్తుంది విద్య అసలైన అందం
రు

No comments:
Post a Comment