భర్త తన తల్లితో సమయం గడపడం ఆమెకు డబ్బు ఇవ్వడం గృహహింస కాదని సెషన్స్ కోర్టు పేర్కొంది ఈ సందర్భంగా దిగివకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది ఆ రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళ తన భర్తతోపాటు అత్తింటి వారిపై గృహహింస కింద కోరుకున్నాశ్రయించింది తల్లి మానసిక రోగాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నాడు అని ఆరోపించింది తాను ఉద్యోగం చేయడానికి అత్త వ్యతిరేకించిందని తనను వేధిస్తున్నారని పిటిషన్లు పేర్కొంది తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబర్ 2004 వరకు ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉన్నాడని సెలవు పై భారత్కు వచ్చినప్పుడు తల్లిని కలిసే వాడని ఆమెకు ప్రతి యేటా పదివేల రూపాయలు పంపేవాడిని పిటిషన్లు ఆరోపించింది తల్లి కంటి ఆపరేషన్ కోసం కూడా డబ్బు ఖర్చు చేశాడని పేర్కొంది గృహహింస మహిళల రక్షణ చట్టం కింద రక్షణ ఉపశమనం కల్పించడంతో పాటు పరిహారం ఇప్పించాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరింది మరోవైపు ఆ మహిళ అభ్యర్థన పై విచారణ పెండింగ్లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నేలకు ₹3,000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది అయితే పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాత గృహహింస క్రింద ఆమె దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది అలాగే మద్యంతర భరణాన్ని రద్దు చేసింది దీంతో ఆ మహిళ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను ముంబైలోని సెషన్స్ కోర్టులో సవాల్ చేయిగా ఇక్కడ చుక్కెదురైంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి