ప్రస్తుత సమాజంలో బాలికలు మహిళలపై అఘైత్యాలు పెరిగిపోతున్నాయి ఈ తరుణంలో తమని తాము రక్షించుకునేందుకు స్వీయ రక్షణ నైపుణ్యాలు అవసరం ఈ నేపథ్యంలో విద్యార్థులు మహిళలకు టైక్వాండో ద్వారా ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేస్తున్నారు జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల ఆమె ప్రోత్సాహంతో ఎంతోమంది థైక్వాండోలో మెలకువలు నేర్చుకుంటున్నారు
1200 మందికి
బాలికలకు మహిళలకు ఆత్మ రక్షణ క్రీడలో ప్రవేశం ఉండాలని ప్రత్యేక చొరవతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు ఇందుకోసం జిల్లా టైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శిక్షకుడు కాంచీపురం మనోజ్తో చర్చించారు ఆయా శాఖల అధికారులతో మాట్లాడిన అనంతరం దాస్ నగర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ పాఠశాలలు ఇంటర్ డిగ్రీ కళాశాలలు విద్యార్థినులకు 45 రోజులపాటు శిక్షణ ఇప్పించారు ఈ శిక్షణలో 1200 మంది విద్యార్థులు టైక్వాండో నేర్చుకుని సాధన చేస్తున్నారు పాఠశాల కళాశాలల పీఈటీలతో చర్చించి నిరంతర సాధన కొనసాగేలా చర్యలు తీసుకున్నారు శిక్షణ సమయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేకంగా తరగతిలో పరిశీలించారు నేర్చుకున్న విద్యను వారి స్నేహితులు బంధువులకు నేర్పించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు
నా కలల ప్రాజెక్టు
సునీత కుంచాల జిల్లా న్యాయమూర్తి
జిల్లాలోని ప్రతి ఆడపిల్ల తనను తాను రక్షించుకునేలా తయారు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది నా కలల ప్రాజెక్టు దీనిపై శిక్షకుడు చర్చలు జరపడంతో ఆయన ముందుకు వచ్చారు. విద్యార్థులకు 45 రోజులపాటు శిక్షణ ఇప్పించాం బాలికలు మహిళలు స్వేచ్ఛగా తమకు నచ్చిన రంగంలో రాణించేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది ఎవరైనా బాలికలు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే ఈ విద్య ఆయుధంగా ఉపయోగపడుతుంది శిక్షణ కాలం పూర్తయిన సాధన కొనసాగేలా చూస్తున్నాం
ప్రణాళికతో ముందుకు పోతున్నాం
మనోజ్ జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శిక్షకుడు
బాలికలకు తైక్వాండో శిక్షణ ఇప్పించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల నన్ను సంప్రదించారు ఇది ఎలా సాధ్యమవుతుందో చర్చించాము. ప్రణాళిక వేసుకుని ఆయా పాఠశాలలో కళాశాలల ప్రిన్సిపాల్లను సంప్రదించాను ఆ తర్వాత శిక్షణను ప్రారంభించాం తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునేలా శిక్షణ తరగతులు నిర్వహించాను అన్నారు
No comments:
Post a Comment