Monday, 19 February 2024

ఉద్యోగమేళా ఉపాధికి బాట

 ఉద్యోగమేళా ఉపాధికి బాట

నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంచి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ కృషి చేస్తుంది. ఇందుకోసం ప్రతినెల విస్తృతంగా జాబ్ మేళాలు నిర్వహించి ఎంతోమందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతోంది 17వేల దరఖాస్తులు జిల్లాలో డిగ్రీ పీజీ చదువు పూర్తి చేసిన వారు ఎంతోమంది ఉన్నారు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కష్టసాధ్యమైనందున ప్రైవేట్ రంగంలో ప్రోత్సాహం కల్పిస్తున్నారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం మంచి జీతభత్యాలు అందిస్తుండటంతో యువత ముందుకు వస్తోంది ఇప్పటివరకు ఉపాధి కల్పన కార్యాలయంలో 1753 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు జాబ్ మేళాలకు మంచి స్పందన రావడంతో రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలతో మేళాలు నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు

 దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి నిజామాబాద్ జిల్లా ఉపాధి కల్పనా అధికారి శ్రీనివాస్ అన్నారు నిరుద్యోగ యువత కోసం ప్రైవేట్ రంగంలో కొలువులు కల్పించడానికి చేపడుతున్న ఉద్యోగమేళాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నెల రెండు మేళాలు నిర్వహిస్తున్నాము యువత సమయం వృధా చేసుకోకుండా ముందుకు రావాలన్నారు

No comments:

Post a Comment