Monday, 19 February 2024

న్యాయవాదిని సన్మానించిన వృద్ధుల సంఘం ప్రతినిధులు

 ప్రముఖ హైకోర్టు న్యాయవాది పెద్ద బచ్చ గారి రామిరెడ్డిని ఆదివారం వృద్ధుల సంఘం ప్రతినిధులు సన్మానించారు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో పలువురి దాతల సహకారంతో వృద్ధుల సంఘ భవన నిర్మాణం చేపట్టారు ఇందులో భాగంగా న్యాయవాది రాంరెడ్డి తనవంతుగా చేయూతని అందించారు ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు అనంతరం న్యాయవాది రామిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న వృద్ధులందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు తనవంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎడ్ల రాజిరెడ్డి నారాయణరెడ్డి మద్ది రాజిరెడ్డి జగ్గారెడ్డి బాల్రెడ్డి రామిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment