Wednesday, 21 February 2024

హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి

 సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ధర్మాన్ని పరిరక్షించేందుకు పాటుపడాలని గుడిమెట్ మహాదేవ మహారాజు అన్నారు మంగళవారం బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో కనకదుర్గాదేవి స్థిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన ప్రసంగించారు ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలన్నారు సనాతన హిందూ ధర్మం చాలా గొప్పదని అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు మూడు రోజులపాటు నిర్వహించే విగ్రహ స్థిర ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా అమ్మవారి విగ్రహం ఊరేగింపు హోమం నిర్వహించారు అన్నదానం చేశారు మహిళలకు కుంకుమార్చనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment