Monday, 19 February 2024

రూఫ్ టాప్ నకు ఆదరణ

 



సౌర విద్యుత్కు నేరుగా దరఖాస్తుకు అవకాశం పీఎం సూర్య ఘర్ పోర్టల్ ఏర్పాటు మూడు కిలో వాట్లకు 78,000 రాయితీ

రూఫ్ టాప్ గృహాలు లేదా భవనాలపైన లేదా ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంటే సౌర విద్యుత్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం ముఫ్త్ బిజిలి యోజన కింద రాయితీ పెంచడంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో గతవారం రోజుల్లో 40 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు కేంద్రం ప్రత్యేకంగా పీఎం సూర్యగ్రహ పేరుతో జాతీయస్థాయి పోర్టల్ ను ఏర్పాటు చేసింది దేశంలో ఎవరైనా రూఫ్ టాప్ సౌర విద్యుత్ కావాలనుకుంటే ఇందులోనే దరఖాస్తు చేసుకోవాలి

రాయితీ పెంపు

ఇంతకాలం రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు కేంద్ర నవీన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు పరిమితులు విధించేది ప్రతి రెండేళ్లకు కొన్ని మెగావాట్ల చొప్పున కోటా ఇచ్చేది అంతవరకు మాత్రమే రాయితీ పరిమితంగా ఉండేది ఉదాహరణకు తెలంగాణకు గత రెండేళ్లలో 50 మెగావాట్ల రూఫ్ టాప్ సౌర విద్యుత్ కేంద్రం అనుమతి ఇచ్చింది రాయితీ ఒక్కో కిలోవాటుకు 14 వేల రూపాయలే ఉండటంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాక 30 మెగావాట్ల వరకే ఏర్పాటు చేశారు దీని అమలు గడువు గత నెలతో ముగిసింది ఈ నేపథ్యంలో కోటి ఇళ్లకు ఉచిత కరెంటు ఇస్తామని నినాదంతో కేంద్రం పీఎం సూర్యగ్రహ పథకాన్ని అమల్లోకి తెచ్చింద నేరుగా దరఖాస్తు చేయడానికి పోర్టల్ని ఏర్పాటు చేసింది మూడు కిలోవాట్ల వరకు ఏర్పాటుకు ఇంత కాలం ఉన్న రాయితీని 42,000 నుంచి 78000 రూపాయలకు పెంచడంతో పలు రాష్ట్రాల ప్రజలు దరఖాస్తుకు ముందుకు వస్తున్నారు కాదా మూడు కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 1,80,000 ఖర్చు అవుతుంది ఇందులో 78,000 సబ్సిడీ లభించనుంది

 300 యూనిట్లకు పైగా ఉచితం

 ఒక ఇంటికి మూడు కిలోమీటర్ల సోలార్ ఏర్పాటు వల్ల నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్తు ఉచితంగా లభిస్తుంది. ఇంటికి ఎన్ని కిలోమీటర్ల వరకు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు రాయితీ మాత్రం కేంద్రం మూడు కిలోవాట్లకే ఇస్తుంది తెలంగాణలో 2014 నుంచి ఇంతవరకు మొత్తం 971 ఇళ్లపై సౌర విద్యుత్ కి ఏర్పాటు కాగా వీరిలో 96% మంది మూడు కిలోమీటర్ల వారే ఉన్నారు రాష్ట్రానికి చాలా ఉపయోగకరమని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

దరఖాస్తు విధానం 

పోర్టల్ లో ఇల్లు ఉన్న రాష్ట్రం కనెక్షన్ ఇచ్చిన డిస్కం కనెక్షన్ సంఖ్య సెల్ ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి తదితర వివరాలను నమోదు చేసుకోవాలి గ్రేటర్ హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ వాసులైతే టీఎస్ ఎస్పీడీసీఎల్ ఉత్తర తెలంగాణలో ఇల్లు ఉంటే టీఎస్ ఎన్పీడీసీఎల్ అనే డిస్కముల పేర్లను నమోదు చేయాలి అనంతరం కరెంటు కనెక్షన్ సెల్ నెంబర్తో లాగిన్ కావాలి గ్రూప్ టాప్ సోలార్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి అనంతరం దరఖాస్తులను ఆయా డిస్కౌంట్లకు పోర్టల్ ఆన్లైన్ ద్వారానే పంపుతుంది డిస్కౌంట్లు అనుమతి ఇచ్చిన తర్వాత సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి ఆయా ప్రాంతాల్లో డిస్కములు ఎంపిక చేసిన సౌర విద్యుత్ కంపెనీల జాబితా ఉంటుంది అందులో ఏ కంపెనీ ద్వారానైనా సౌరఫలకాలని ఏర్పాటు చేయించుకోవచ్చు ఈ ప్లాంట్ ఏర్పాటు అయిన తర్వాత నెట్ మీటర్ కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలి ఈ మేరకు డిస్కౌంట్ సిబ్బంది తనిఖీ చేసి ధృవీకరణ పత్రం ఇస్తారు అనంతరం బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే రైతు సొమ్ము కేంద్రం నేరుగా జమ చేస్తుంది

రాష్ట్ర ప్రభుత్వము కొంత రాయిస్తే రాయితీ ఇస్తే మేలు నెలకు 350 యూనిట్ల వరకు వాడే వారికి ఈ పథకం ఉపయోగకరం వారికి బిల్లుల భారం తప్పుతుంది కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అదనంగా కొంత రాయితీని ఇస్తున్నాయి ఇదేవిధంగా తెలంగాణలోనూ ప్రభుత్వ మరి కొంత రాయితీ ఇవ్వాలని కోరుతున్నాము దీంతో ఇంకా ఎక్కువ మంది ఈ పథకం వినియోగించుకోవడానికి ముందుకొస్తారని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్ కుమార్ గౌడ్ అన్నారు



No comments:

Post a Comment