అద్దం ముందు నిలబడిన ప్రతిసారి పశ్చాతాపం దహిస్తుంది ఎంతకీ బరువు తగ్గడం లేదని బాధ వేధిస్తుంది ఇలాంటి అప్పుడు ఏదో ఒక వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవడం చాలా మంచిది కసరత్తు కుదరనప్పుడు ఈ ప్రయత్నాలు చేయవచ్చు
ఉదయాన్నే వ్యాయామం లేదా వాకింగ్కు అవకాశం లేకపోతే కనీసం ఓ పది నిమిషాలు యోగాసనాలు వేయవచ్చు ఇంటికి చెమట పట్టేలా గార్డెనింగ్ లాంటి పనులు చేసినా మంచిదే
బ్రేక్ఫాస్ట్ ఆ రోజుకు సరిపడా ఇంధనాన్ని ఇస్తుంది కాబట్టి అల్పాహారం తప్పించి లేదా తగ్గించి బరువు తగ్గాలనుకోవడం అపోహే పైగా అది మరింత ఆకలికి మరింత తిండిపోతు తనానికి దారితీస్తుంది
రోజు రెండు గంటలైనా ఫోన్లో మాట్లాడుతూ గడిపేస్తాం అదేదో అటు ఇటు నడుస్తూ ముచ్చట్లు పెడితే వాకింగ్ కూడా అయినట్లే కదా
చూయింగ్ గం నమ్మడం ముఖ కండరాలకు మంచి వ్యాయామం ఇలాంటి అలవాటు ఉన్నవారు చిరుతిళ్ళ జోలికి వెళ్ళరని ఓ అధ్యయన సారాంశం తెలుపుతుంది
రాత్రివేళ త్వరగా తినేసి తొందరగా నిద్రకు ఉపక్రమించడం అధిక బరువును దించుకోవడానికి ఉత్తమ మార్గం అని చెబుతున్నారు నిపుణులు
వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోకుండా అప్పుడప్పుడు కిచెన్ వరకు వెళ్లి నీళ్లు తాగడం కూడా చిన్నపాటి వ్యాయామమే దీనివల్ల శరీరానికి సరిపడా తేమా అందుతుంది
No comments:
Post a Comment