మేడారం మహా జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర గిరిజనుల పండగ మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఇంటి వద్దకే సమ్మక్క సారలమ్మ ప్రసాదం బంగారు అందజేయాలని టిఎస్ఆర్టిసి అధికారులు నిర్ణయించారు గతంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తలంబ్రాలు బంగినపల్లి మామిడిపళ్ళు విజయవంతంగా మీ ఇంటి వద్దకే చేరవేశాము భక్తులకు మరింత దగ్గర అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పండగ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రసాదం బంగారంతో పాటు అమ్మవారి పసుపు కుంకుమను భక్తులకు టిఎస్ఆర్టిసి కార్గో వారు అందించనున్నారు ఈ సదవకాశం ఈనెల 25వ తేదీ వరకు భక్తులు నేరుగా లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద ప్రసాదం బుక్ చేసుకోవచ్చు ప్రసాదం బుక్ చేసుకునే భక్తులు నిజామాబాద్ రీజియన్ లోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద 2009 రూపాయలు చెల్లించి బుకింగ్ టికెట్ పొందాలి ఈ ప్రసాదం బంగారం బుక్ చేసుకున్న వారికి జాతర పూర్తి అయిన తర్వాత ఆర్టీసీ సిబ్బంది భక్తుల ఇంటి వద్దకే వచ్చి ప్రసాదాన్ని అందజేస్తారు ఈ ప్రసాదాన్ని అందించిన సమయంలో మీరు మా సిబ్బందికి ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించిన అవసరం లేదని డి శ్రీనివాస్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నిజామాబాద్ తెలిపారు మేడారం ప్రసాదం బంగారం బుకింగ్ కొరకు నిజామాబాద్ రీజియన్ డిపో నెంబర్లు ఆర్మూర్ 9550232626 9014296638 నిజామాబాద్ వన్ మురళి 9154298727 నిజామాబాద్ టు సాయికుమార్ 7396889496 బాన్స్వాడ ఇర్ఫాన్ 9154298729 కామారెడ్డి రాజు 9154298730 ఆర్ ఎం ఆఫీస్ నిజామాబాద్ ఆర్ఎం ఈ కాశిరాం 8639969647 9154298731 నెంబర్లకు మాట్లాడి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నిజామాబాద్ కామారెడ్డి జాతరలో కు వెళ్లలేని భక్తులు ఆర్టీసీ అందిస్తున్న సువర్ణ అవకాశాన్ని సద్వినియం చేసుకొని ప్రసాదం బుక్ చేసుకోవాలని డిప్యూటీ ఆర్ ఎం సరస్వతి తెలిపారు ఈ సేవలు ఈనెల 25వ తేదీ వరకు ఉంటాయని తెలిపారు
No comments:
Post a Comment