ములుగు జిల్లా లక్నవరం సరస్సు సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పస్రా ఎస్సై షేక్ మస్తాన్ చెప్పారు మేడారం మహా జాతర నేపథ్యంలో వాహనాల రద్దీ భారీ స్థాయిలో పెరిగిందని ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరం రూట్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పారు మేడారం భక్తులు పర్యాటకులు సహకరించాలని కోరారు మేడారం జాతర ముగిసిన అనంతరం తిరిగి లక్నవరం సరస్సు సందర్శన కొనసాగిస్తామని వెల్లడించారు వాహనాలు లక్నవరం సరస్సు వద్దకు వెళ్లకుండా బుస్సాపూర్ క్రాస్ వద్ద బార్కెట్లు ఏర్పాటు చేశారు
No comments:
Post a Comment