Wednesday, 21 February 2024

విదేశీ ఉన్నత విద్య స్కాలర్షిప్ నాకు దరఖాస్తు చేసుకోవాలి

 తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే పేద మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ పార్సి విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు 2023 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాలు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ కోర్సులు చదివేందుకు స్కాలర్షిప్లు లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మంజూరుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అన్ని అర్హత ప్రమాణాలు కలిగి విదేశీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ కోర్సులు ఆగస్టు 1 2023 నుంచి డిసెంబర్ 31 2023లో పర్మిషన్ తీసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో www.Telanganaepass.cgg.gov.in   ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి అన్నారు అర్హత ఉన్న విద్యార్థులు మార్చి 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 22 మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం లేదా 8096973346 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని తెలిపారు

No comments:

Post a Comment