మన నిత్యజీవన విధానం అలవాట్లు వంటివి మన జీవితకాలం పై ప్రభావం చూపుతాయని తెలిసింది మరి ఏ అలవాట్లు పద్ధతులు మార్చుకుంటే మరణం మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా దానిపై ఒక విస్తృత అధ్యయనం జరిగింది 2011-19 మధ్య 42 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మంది పై జరిగిన పరిశోధనల్లో ఆరు కీలక అంశాలను గుర్తించారు వీటిని పాటించని వారితో పోలిస్తే పాటించే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందని తేల్చారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారితో పోలిస్తే వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు మానసిక ఒత్తిడి ఆందోళనలను నియంత్రించుకోగలిగితే 29% డ్రగ్స్ కు దూరంగా ఉంటే 38% మరణం రిస్క్ నువ్వు తప్పించుకున్నట్లేనని తేల్చారు
దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది
శారీరకంగా చురుగ్గా ఉంటే 46% ధూమపానం అలవాటు లేకుంటే 30% ఆరోగ్యకరమైన శాఖాహారం తీసుకుంటే 21% మద్యం అలవాటును బాగా తగ్గించుకుంటే 19% ఏడు నుంచి తొమ్మిది గంటల రాత్రి నిద్రపోతే 18% సానుకూల సామాజిక సంబంధాలు ఐదు శాతం ఈ ఆరింటిలో కనీసం ఒకదానిని పాటిస్తే 26% మూడింటిని పాటిస్తే 50 శాతం మొత్తం ఆరింటిని అలవాటు చేసుకుంటే 73% మరణ ప్రమాదం తగ్గుతుంది
No comments:
Post a Comment