18, ఫిబ్రవరి 2024, ఆదివారం

పీచు మిఠాయి తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం

 రొడమైన్  బి అనే రసాయనం కల్పినట్లు నిర్ధారణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన 




పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయిపై తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం విధించారు వీటిలో కృత్రిమ రంగుల కోసం ఆరోగ్యానికి హాని కలిగించే రోడ మైండ్ బి అనే రసాయనాన్ని కల్పి తయారు చేస్తున్నట్లు గుర్తించారు కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో విక్రయిస్తున్న పీచు మిఠాయి రంగు కొత్తగా ఉందని పలువురు ఆహార భద్రత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు వారు నమూనాల సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోడమాన్ బి వాడినట్లు తేల్చారు దుస్తులకు రంగులు వేయడం అగర్బత్తిలు తయారీ వంటి తదితర పరిశ్రమల్లో ఈ రసాయనాన్ని ఎక్కువగా వినియోగిస్తారు ఇది కలిపిన పీచు మిఠాయిని తింటే కిడ్నీ కాలేయం పని తీరుపై ప్రభావం పడనుంది చివరికి క్యాన్సర్కు దారి తీసే ప్రమాదం ఉంది దీంతో పుదుచ్చేరిలో 30 మందికి పైగా విక్రయిదారులకు హెచ్చరికలు జారీచేసి నిషేధం విధించారు తమిళనాడులోను అప్రమత్తమైన అధికారులు చెన్నై మెరీనా డీసెంట్ నగర్ బీచ్లలో తనిఖీలు చేయగా రసాయనం కలిపినట్లు నిర్ధారించారు శనివారం ఈ అంశంపై ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం ఒక ప్రకటన విడుదల చేశారు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం పీచు మిఠాయిని నాసిరకం తినకూడని ఆహారంగా దృహికరించాం. వీటిని తయారు చేసిన విక్రయించిన శిక్షారహమైన నేరంగా పరిగణిస్తాం అని పేర్కొన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి