21, ఆగస్టు 2026, శుక్రవారం

ఫ్రీ కోచింగ్ @కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్, మంచిర్యాల

 ఎస్సై, కానిస్టేబుల్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు. 

ఈ ఉచిత శిక్షణ 2 నెలల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల వారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి లింక్ ఓపెన్ చేసి పేరు నమోదు చేసుకోవడం ద్వారా కోచింగ్ లో చేరవచ్చని తెలిపారు. నిపుణులైన 20 మంది ఫ్యాకల్టీ తో రెండు నెలల పాటు కోచింగ్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. 

ఈ శిక్షణ ను పోటీ పరీక్షలలో ఎంతో అనుభవం కలిగిన విన్నర్స్ ఐకాన్ స్టడీ సర్కిల్ , కెరియర్ మిత్ర నాగరాజ్ , అనుభవజ్ఞులైన హైదరాబాద్ ఫ్యాకల్టీ బృందంతో  ఇప్పిస్తున్నామని తెలిపారు. శిక్షణ లో భాగంగా అర్థమెటిక్, రీజనింగ్ ,సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటి, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ,ఇంగ్లీష్ ,ఎకానమీ, కరెంట్ అఫైర్స్ తెలంగాణ సంబంధ అంశాలు తదితర పోటీ పరీక్షలకు అవసరమైన ముఖ్యమైన అంశాల పై శిక్షణ ఇస్తారని తెలిపారు. 

60 రోజుల శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారికి" ఫిజికల్ టెస్ట్ లో కూడా ఉచిత శిక్షణ ఇవ్వడం" జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మంచిర్యాల జిల్లా నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 



ఫ్రీ నీట్ కోచింగ్ @ఎస్సీ గురుకుల సొసైటీ

 తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ 2027 లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరంలో హైదరాబాద్ చిలుకూరు  సీ ఓ ఈ లో బాలురకు, మహేంద్ర హిల్స్ సిఓఈ లో బాలికలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది. బాల బాలికలకు 200 సీట్లు ఉన్నాయని ఇందులో బాలురు బాలికలకు చెరో వంద సీట్లు కేటాయించామని తెలిపారు. 

2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ బై పీసీ పాస్ అయి నీట్ 2026 పరీక్షకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈడబ్ల్యూఎస్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని గురుకుల సొసైటీ అధికారిక వెబ్సైట్ నుంచి పొందాలని పూర్తి వివరాలతో అవసరమైన ధృవ పత్రాలను జత చేసి సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ కు సమర్పించాలని తెలిపింది. దరఖాస్తు సమర్పణకు ఈనెల 22 చివరి తేదీ అని స్పష్టం చేసింది. దరఖాస్తు కు ఎలాంటి ఫీజు అవసరం లేదని స్పష్టం చేశారు. 

https://tgswrcis.telangana.gov.in

కామారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్.. ఉప్పల్వాయి..97045 50256.

20, ఆగస్టు 2026, గురువారం

ఉచిత శిక్షణ @అఖిల్ రాజ్ ఫౌండేషన్

 పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అఖిల్ రాజ్ ఫౌండేషన్ ప్రతినిధి మిద్దె శాంత కుమార్ తెలిపారు. 

ఈ మేరకు శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను భిక్కనూరు ఎస్సై అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగులను వారు కోరారు.

పూర్తి సమగ్ర వివరాలకు  98490 51483 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.