3, మార్చి 2024, ఆదివారం

అనంతమైన అమ్మ ప్రేమ

 జీవితం పూల పాన్పు కాదు జీవితంలో కష్టసుఖాలను ఎదుర్కొని పైకొచ్చిన వారు చాలామంది ఈ మాటని అంటుంటారు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ పుట్టుకతోనే దేశంలోని అత్యంత సంపన్నుల ఇంటి బిడ్డ ఆయన అనంత అంబానీ ఈ మాటని అనడం మాత్రం ఆశ్చర్యమే ముకేశ్ అంబానీ చిన్న కుమారుడైన అనంతం బాని ప్రీ వెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా గుజరాత్ లోని జామ్ నగర్  జరుగుతున్నాయి కళ్ళు చెదిరే దేదీప్యమానమైన వెలుగు జిలుగులు ఆడంబరాలే కాదు ఆ వేడుకలలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు అంతులేని భావోద్వేగాలు ఆచారాలు సంప్రదాయాలు సైతం కనబడుతున్నాయి

అనంత అంబానీ చాలా సందర్భాలలో అతని అధిక బరువు కారణంగా వార్తలలోనూ సోషల్ మీడియాలోనూ కనబడుతున్నాడు పెళ్లి అనుకో అనుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో అతనిపై ఎన్నో రకాల పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు కనబడుతున్నాయి చాలామంది వ్యక్తులు సోషల్ మీడియా కారణంగా తమ అధికారి నెగిటివ్ ఇమేజ్ లో ఇరుక్కుపోతున్నారు సెలబ్రిటీలకు ఇది మరింతగా వర్తిస్తుంది అయితే అదే విధంగా కొంతమంది తమలోని నిజ తత్వాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. అనంత అంబానీ విషయంలో ఇది నిజమవుతోంది అతని రూపం పరంగా పలు రకాల ట్రోల్లింగ్ జరిగినా అతను మంచివాడని అంతటి సంపన్నుడైనా ఎంతో వినయంతో ఉంటాడని మెచ్చుకుంటున్నారు కొంతమంది నిటిజన్లు తన ప్రీ వెడ్డింగ్ వేడుకలలో అనంత అంబానీ మాట్లాడిన మాటలు సైతం మరొకసారి అతనిలోని పాజిటివ్ కోణాన్ని ప్రపంచానికి చూపించాయి

అనంత అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు శుక్రవారం రాత్రి నుండి జరుగుతున్నాయి ఆ వేడుకలలో అతను తనలోని భావోద్వేగాలను వెల్లడిస్తూ మాట్లాడాడు ఎంతో వినయ విధేయతలతో అనంత్ మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది ఆ స్పీచ్ లో అనంతతన తల్లిదండ్రులు ముకేశ్ అంబానీ నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలిపాడు తన జీవితంలో తాను పొందినవి అన్ని తల్లితండ్రుల నుండి సమకూరినవే అని అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు కొడుకు మాటలకు తండ్రి ముకేశ్ అంబానీ కళ్ళు సైతం చమర్చి నాయి

గుజరాత్ లో జరుగుతున్న మూడు రోజుల పై వెడ్డింగ్ వేడుకల కోసం తన తల్లి రోజుకి 18 నుండి 19 పాటు పని చేశారని అతని చెప్పుకొచ్చాడు ఈ ఘనత మొత్తం తన తల్లికి చెందుతుందంటూ తన తోబుట్టువులకు వారి జీవిత భాగస్వాములకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు మీరందరూ పాల్గొని నేను రాధిక ప్రత్యేకంగా ఫీల్ అయ్యేలా చేశారంటూ వచ్చిన అతిథులకు కూడా ఎంతో వినయంగా కృతజ్ఞతలు తెలిపాడు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమని కూడా కోరాడు ముఖ్యంగా తన ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న శ్రద్ధని వారి ఇచ్చిన ధైర్యాన్ని చెప్పి అక్కడున్న వారిని కూడా భావోద్వేగానికి గురి చేశాడు. ఈ సందర్భంలోనే ఆనంద తన జీవితం పూల పాన్పు కాదని తాను ముళ్ళ తాలూకు బాధని ఎంతో భరించాలని తెలిపాడు. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నాను కానీ మా అమ్మ నాన్న ఎప్పుడూ నేను ఆ బాధని గుర్తించని స్థితిలో ఉండేలా ధైర్యం చెప్పారు వాళ్లు నిరంతరం నాకు అండగా నిలిచారు నేను ఏదైనా అనుకుంటే చేయగలను అని నమ్మకాన్ని నాలో పెంచారని అనంత చెప్పుకొచ్చాడు ఆరోగ్యం సరిగా లేని బిడ్డలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ముఖేష్ నితా అంబానీ విజయం సాధించి అలాంటి తల్లిదండ్రులు స్ఫూర్తిని నింపారు అని చెప్పవచ్చు




గరం మసాలా ఎలా చేయాలి

 పనీర్ టమాటో బంగాళదుంప లాంటి శాఖాహారాలు చికెన్ మటన్ లాంటి మాంసాహారాలు బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఇలా ఏవైనా సరే స్పైసీగా ఉండాలంటే గరం మసాలా జోడి చేస్తాము ఒక్క చెంచా వేస్తే చాలు అద్భుతమైన రుచి వచ్చేస్తుంది ఇంత ముఖ్యమైన గరం మసాలా కొనకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగంటే కడాయిలో అరకప్పు జీలకర్రను వేయించి ఒక పళ్లెంలోకి తీయాలి సగం జాజికాయ మిరియాలు లవంగాలు యాలకులు రెండు చెంచాలు చొప్పున నాలుగు బిర్యానీ ఆకులు అంగుళామంతా దాల్చిన చెక్కలు మూడు చాపత్రికి కొద్దిగా స్టార్ మొగ్గలు బ్లాక్ కారడమములు మూడు చొప్పున తీసుకొని వీటిని కూడా వేయించి మంచి వాసన వస్తున్నప్పుడు జీలకర్ర ఉన్న పళ్లెంలోకి తీయాలి అదే కడాయిలో అరకప్పు ధనియాలు నాలుగు ఎండుమిర్చిలను వేయించాలి వాటిని కూడా తీసి రెండు చెంచాలు సోంపు వేయించాలి అన్ని వేయించడం అయ్యాక చల్లారనిచ్చే గ్రైండ్ చేయాలి అంతే గుమగుమలాడే గరం మసాలా తయారైపోతుంది దీనిని తడి లేని గాలి చొరబడని సీసాలో భద్రం చేస్తే చాలా నాళ్ళు నిల్వ ఉంటుంది



2, మార్చి 2024, శనివారం

రామోజీ ఫిలిం సిటీ లో మహిళా మహోత్సవాలు

 మార్చి 31 వరకు ప్రత్యేక వేడుకలు

మహిళా మణులకు నిరాజనాలు పలుకుతూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ లో మార్చి 31 తేదీ వరకు మహిళా మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక వేడుకలలో భాగంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆనందించేలా వివిధ ప్రత్యేక కార్యక్రమాలు సరదా సరదా వినోదాలు మిన్నంటుతున్నాయి సరికొత్తగా మహిళల కోసమే నిర్వహిస్తున్న ఈ వేడుకలలో ప్రత్యేకంగా రూపొందించిన స్వాగత కార్యక్రమం తో అద్వితీయ ఆహ్వానం పలుకుతున్నారు అభ్యంతరం వినోద భరితంగా సాగే కార్యక్రమాలను అలరిస్తున్నాయి ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి సరికొత్త అనుభూతిని పొందుతున్నారు టాలెంట్ హంటులో పాల్గొని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సరికొత్తగా రూపొందించిన కార్యక్రమాలలో భాగంగా కొరియోగ్రాఫర్తో సినీ నృత్య వీడియోను రూపొందించేందుకు అవకాశం కల్పించారు తెలివిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వేదికను ఏర్పాటు చేసి దేవసేన ఆఫ్ ది డే గా ఎంపిక అయ్యేందుకు అవకాశం ఇచ్చారు చంద్రముఖి సేటులో సినిమా సన్నివేశాన్ని రక్తి కట్టించేలా నటన ప్రతిభను చాటేందుకు వీలు కల్పిస్తున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రాలతో ఫోటో తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. డీజే మధ్య ప్రత్యేక సాయంత్రపు వినోదాలు అతివలన అలరిస్తున్నాయి ప్రత్యేక ఆఫర్తో మార్చి 31 వరకు కొనసాగే మహిళా మహోత్సవాలలో పాల్పంచుకోవాలనుకునే అతివాళ్ళకు ప్రత్యేక అపరిస్తున్నారు రెండు మహిళల ప్రవేశ టికెట్లు కొనుగోలు చేసిన వారికి 500 రూపాయలు తగ్గిస్తున్నారు ఈ ఆఫర్ అడ్వాన్స్ ఆన్లైన్ బుకింగ్ మాత్రమే వర్తిస్తుంది వివరాలకు 7659876598 8008607026 91827 30106

www.ramojifilmcity.com లో సంప్రదించవచ్చు అని తెలిపారు