ఫిట్నెస్ ని ప్రేమించే అమ్మాయిలు చకచకా నడుస్తూ ఒకవైపు స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళతో సరదాగా గడిపే నాయనమ్మలు అమ్మమ్మలు ఇంకోవైపు కష్టసుఖాలు పంచుకుంటూ తేలిక పడే అతివాళ్ళు మరొకవైపు కనిపిస్తారు ఆ పార్కులు కానీ ఎక్కడా మగవాళ్ళు కనిపించరు అదే ఆ పార్కు ప్రత్యేకత రాజమండ్రిలోని ఆర్ వి నగర్ లో ఉన్న ఈ పార్కులో మహిళలకు పదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే ప్రవేశం ఉంది మహిళల్లో ఫిట్నెస్ ఆరోగ్యం పై అవగాహన పెంచాలని ఉద్దేశంతో ఈ పార్కును ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్ తో పాటు చుట్టూ మనసుని ఆహ్లాద పరిచేలా బొటానికల్ గార్డెన్ ని పెంచుతున్నారు ఇక్కడే కాదు ఢిల్లీలోనూ మహిళలు సౌకర్యంగా వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పింక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు

No comments:
Post a Comment