Wednesday 31 January 2024

త్వరలో రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

 త్వరలో రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీప్రియ వెల్లడి

రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చేవారిని ఆకట్టుకునేలా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో త్వరలో సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజిని ప్రియ తెలిపారు రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు అనుమతి ఇచ్చిన అప్పటినుండి ఇప్పటివరకు లక్ష మంది వచ్చారన్నారు రాష్ట్రపతి నిలయం ప్రత్యేకతలు సందర్శకులు అనుమతికి సంబంధించి పలు వివరాలు మంగళవారం మీడియా సమావేశంలో రజనీప్రియ అడ్మిన్ ఆఫీసర్ దులార్ మింగ్ అసిస్టెంట్ అడ్మిన్ ఆఫీసర్ రాజేష్ యాదవ్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచిత ప్రవేశ సదుపాయం ఉందని తెలిపారు సాధారణ పౌరులకు 50 రూపాయలు విదేశీయులకు 250 ప్రవేశ రుసుముగా నిర్ణయించినట్లు చెప్పారు ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుందని సోమవారం సెలవు అని పేర్కొన్నారు రాష్ట్రపతి నిలయ సందర్శన విద్యార్థులకు విహారయాత్రతో పాటు విజ్ఞాన యాత్రగా కూడా నిలుస్తుందని అన్నారు పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వకుండా ఇక్కడి క్యాంటీన్లో ఆర్గానిక్ ఆహారం అందిస్తున్నామని రజనీప్రియ వెల్లడించారు హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల జాబితాలో రాష్ట్రపతి నిలయం చేర్చేందుకు త్వరలో పర్యాటకశాఖ అధికారులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకొని ఉన్నట్లు చెప్పారు నిలయం ఆవరణలో ప్రతి కట్టడం విశేషాలు వివరించేందుకు గైడ్లు అందుబాటులో ఉన్నారని రజనీ ప్రియ తెలిపారు.



No comments:

Post a Comment