Wednesday 31 January 2024

ఓ టి ఎస్ గడువు మార్చి 31 వరకు పొడగింపు

 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఏకకాల పరిష్కార పథకం వన్ టైం సెటిల్మెంట్ గడువు మార్చి 31 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా డీసీసీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సొసైటీ చైర్మన్లు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల అభ్యర్థుల మేరకు ప్రవేశపెట్టిన ఓ టి ఎస్ పథకం జనవరి 31తో గడువు ముగియనున్న విషయం తెలిసిందే దీంతో ఈ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు పొడగించి నట్లు పేర్కొన్నారు మార్చి 31 2023 నాటికి కాలపరిమితి ముగిసి బ్యాంకు ద్వారా బట్వాడా చేసిన సొసైటీలో తీసుకున్న రుణాలపై అపరాధ వడ్డీ 100% మాది వాయిదా మీరిన వడ్డీ పైన 30% వడ్డీ మాఫీ చేస్తామన్నారు దీర్ఘ కాలిక జేఎల్సి ఎస్ హెచ్ జి రుణాలపై వాటి 32 శాతం మాఫీ చేయనున్నట్లు తెలిపారు కావున అర్హులైన రుణ గ్రహీతలు ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వినియోగం చేసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు మిగతా వివరాల కోసం సంబంధిత సొసైటీలు బ్రాంచ్ మేనేజర్లను సంప్రదించాలని భాస్కర్ రెడ్డి సూచించారు



No comments:

Post a Comment