3, మార్చి 2024, ఆదివారం

సామూహిక సత్యనారాయణ వ్రతాలు

 నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో హైవేపై ఉన్న అంజనాద్రి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులకు కన్నదానం చేశారు కార్యక్రమంలో ఆయా గ్రామాల భక్తులతో పాటు అంజనాద్రి ఆలయ ధర్మకర్త కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం

 విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధి రమేష్ చందు అన్నారు మండలంలోని కుప్రియల్ గ్రామ శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు బాల్య వివాహాలు మానవక్రమ రవాణా సామాజిక మాధ్యమాలతో ఎదురవుతున్న సమస్యలు మాదకద్రవ్యాల వినియోగము విద్య హక్కు గృహహింస నిరోధక ఫోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులకు సమస్యలు ఉంటే జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 19301098181 కు కాల్ చేయాలని అన్నారు సమావేశంలో ప్రిన్సిపాల్ రా గిణి ఐ ఎస్ ఆర్ డి సంస్థ ప్రతినిధి అమృత రాజేందర్ రావు అర్ల విట్టల్ రావు సంతోష్ అధ్యాపకులు పుష్పలత శ్రావణి మాధురి కవిత సింధుశ్రీ స్వప్న సుజాత తదితరులు పాల్గొన్నారు



వరల్డ్ రివర్స్ ఫోరం ఆవిర్భావం

 చేనేత కళను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఇండోనేషియా బాలిలో నిర్వహించిన సమావేశం వేదికగా వరల్డ్ వీవర్స్ ఫోరం ఆవిర్భవించింది ఈ మేరకు అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త ఎర్ర మాధ వెంకన్న నేత శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు ఫోరం లోగోను ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ వ్యవస్థాపకురాలు పాపీ దర్శనం ఇండోనేషియా ఫ్యాషన్ డిజైనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు మలైక పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజ మంజయ్య చింతకింది మల్లేశం జాతీయ అవార్డు గ్రహీతలు కొలను రవీందర్ గంజి యాదగిరి లొల్లి వీర వెంకట సత్యనారాయణ గజం భగవాన్ జాతీయ మెరిట్ సర్టిఫికెట్ గ్రహీతలు చిలుకూరు శ్రీనివాస్ వరదలు ఆవిష్కరించాలని వివరించారు ప్రపంచవ్యాప్తంగా చేనేత కళాకారులను ఫోరం పరిధిలోకి తీసుకొచ్చి నేత కలను విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఫోరం పని చేస్తుందని తదుపరి కార్యక్రమాలు వరల్డ్ వీవర్స్ ద్వారా ఆధ్వర్యంలో కొనసాగుతాయని ఆ ప్రకటనలో వెల్లడించార