18, మార్చి 2024, సోమవారం

ఘనంగా బేడీల మైసమ్మ బోనాలు

 నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామస్తులు బేడీల మైసమ్మ తల్లికి ఇంటింటికి బోనాలతో ఊరేగింపు ర్యాలీ చేపట్టారు బ్యాండ్ మేళాలు డీజే పాటలతో యువకులు నృత్యాలు చేస్తూ వాటపాటలతో అమ్మవారికి బోనాలు తీశారు కార్యక్రమంలో ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



బగళాముఖీ అమ్మవారి జన్మదినం

 ఎల్లారెడ్డి పట్టణంలోని భగలాముఖి అమ్మవారి పీఠంలో అమ్మవారి జన్మదిన వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు మాఘమాస అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు చేశారు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిష పండితులు క్రాంతి పటేల్ తదితరులు ఉన్నారు

ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గం

 ఏఎస్ఆర్ ఫౌండేషన్ జిల్లా చైర్మన్గా శ్రీనివాసరావును నియమించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ తెలిపారు ఆదివారం బాన్స్వాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు  చైర్మన్గా శ్రీనివాసరావు , సంస్థ జిల్లా అధ్యక్షుడిగా బంగారు రవి, ప్రధాన కార్యదర్శిగా వాగ్మా రే బాలు ఉపాధ్యక్షులుగా రోటే  సాయిలు కోడంరాజు కోశాధికారిగా కల్లూరి రాజారాం సంయుక్త కార్యదర్శి లుగా విజయ్ , వస్సి  ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొప్పని శ్రీనివాస్ ,సంగు గోవర్ధన్ తదితరులు ఎన్నిక అయ్యారు