7, మార్చి 2024, గురువారం

బుగ్గ ఆలయం సేవలకు నిలయం

 



కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో దట్టమైన అటవీ క్షేత్రంలో కొండా కోనల మధ్య బుగ్గ ఆలయం వెలసింది సాక్షాత్తు శ్రీరాముడు వనవాసంలో సైకతలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్లు భక్తుల నమ్మకం బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే చిరకాల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రికి లక్షల సంఖ్యల స్వామిని దర్శించుకుంటారు దాతలు గ్రామస్తుల సహకారంతో ఆలయంలో నిత్యాన్నదానం వృద్ధాశ్రమం గోశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు

వృద్ధులకు ఆశ్రయం వృద్ధులకు అనాథ వృద్ధులకు ఆలయంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 35 మంది వరకు వృద్ధులు ఉంటున్నారు వీరికి సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉదయం రాత్రి భోజనం పెట్టి దుస్తులు ఇతర సామాగ్రి అందజేస్తారు వృద్ధులు మరణిస్తే అంత్యక్రియలను సైతం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆలయా ఆవరణలోని గోశాలలో 85 గోవులను పోషిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు బుగ్గ ఆలయంలో పలు కార్యక్రమాలు చేయడానికి భక్తులు గ్రామస్తులు సహకారం మరువలేనిది గత 23 ఏళ్లుగా నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతోంది ఆలయ పునరుద్ధరణకు దాతలు పెద్ద సంఖ్యలు ముందుకు రావాలి అని ఆలయ అర్చకుడు ప్రభాకర్ స్వామి అన్నారు నిరుపేదలకు చేయూత అందించేందుకు కృషి చేస్తున్నాం గ్రామస్తులు దాతల సహాయంతో అనాధలకు ఆశ్రయం కల్పిస్తున్నాం మహాశివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోవాలి అని ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు

23 ఏళ్లుగా నిత్యాన్నదానం బుగ్గ ఆలయంలో 2001 నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి ఒక సంచి బియ్యాన్ని అందజేస్తారు తొలిత కిలో నుంచి ప్రారంభించి ప్రస్తుతం నిత్యం 50 కిలోల వరకు అన్నదానం చేస్తున్నారు సోమవారం రెండు క్వింటాల బియ్యం అన్నదానం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు

నేటి నుంచి వేడుకలు ప్రారంభం ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముంబారంగా కొనసాగుతున్నాయి గురువారం రోజున అఖండ దీపారాధన రాత్రి పల్లకి సేవ గ్రామంలో ఊరేగింపు ఉంటుంది శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటలకు అగ్నిగుండాలు రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు


9న నిమ్స్ హాస్పిటల్ కు సెలవు

 శివరాత్రి సందర్భంగా ఈనెల తొమ్మిదవ తేదీన పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ క్లోజ్ అయి ఉంటుందని ఎగ్జిక్యూటివ్ రిజిస్టర్ శాంతివీర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆ రోజున కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుతాయి అన్నారు పేషెంట్లు శుక్రవారం యధావిధిగా వైద్య సేవ పొందవచ్చు అన్నారు శని ఆదివారాల్లో అత్యవసర వైద్య సేవలు అందుతాయని సోమవారం నుంచి పూర్తిస్థాయి సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు

6, మార్చి 2024, బుధవారం

జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు

 వంటల్లో కరివేపాకు వేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫర్మేషన్ లక్షణాలు ఉంటే కరివేపాకులు బి విటమిన్ తో పాటు నెల నిన్ను కూడా ఉత్పత్తి చేస్తుంది ఇది జుట్టు ఆరోగ్యానికి దోహదపడుతుంది

గుప్పెడు కరివేపాకు గుప్పెడు మందారం ఆకులను కొన్ని నీళ్లు వేసి పేస్ట్ గా చేయాలి ఈ పేస్టు నువ్వు ఆడుకు తగిలేట్లు పట్టించాలి పట్టించిన తర్వాత అరగంట ఉంచే జుట్టును శుభ్రపరచాలి ఇలా తరచూ చేస్తుంటే జుట్టు నల్లగా ఉంటుంది

ఒక గిన్నెలో 20 కరివేపాకులు వేసి అందులో కప్పు నీళ్లు పోసిన తర్వాత టేబుల్ స్పూన్ మెంతులు జతచేయాలి బాగా మరిగించి నీళ్లన్నీ తగ్గిపోయే వరకు ఉంచాలి. చివరగా వచ్చిన చిక్కటి ద్రవంలో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి మిశ్రమాన్ని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి ఇలా చేస్తే తెల్లని జుట్టు రాదు

30 కరివేపాకులను తీసుకొని పేస్ట్ చేయాలి ఇందులోకి టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని మాడుకు తగిలినట్లు పట్టించాలి తల మీద చల్లగా ఉంటుంది దీంతోపాటు జుట్టు పెరుగుతుంది

గుంత ఫ్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి నూనె మరిగేటప్పుడు 20 కరివేపాకులను వేయాలి మూడు నిమిషాల తర్వాత దించేసి చల్లార్చిన తర్వాత చుట్టుపట్టించాలి ఇలా తరచూ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది

15 కరివేపాకులను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. బౌల్లో ఈ పేస్ట్ వేసి అందులోకి నాలుగు టీ స్పూన్ల ఉల్లిపాయ రసం వేయాలి విశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి జుట్టును మర్దానం చేశాక 20 నిమిషాల పాటు వదిలేయాలి ఇలా చేస్తుంటే జుట్టులో చుండ్రు సమస్య తగ్గిపోతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది