3, మార్చి 2024, ఆదివారం

జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ

 తెలంగాణలో మరో జర్నలిస్టు సంఘం ఆవిర్భవించింది జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్ తెలంగాణ JUST పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు నూతన కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్లోని టీఎన్జీవో భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంఘం కన్వీనర్ గా ఎం.వి.రమణ కోకన్వీనర్లుగా పివి శ్రీనివాస్ గణేష్ బిజిగిరి శ్రీనివాస్ శశికాంత్ మురళి మల్లీశ్వరి సలహాదారుగా కొండలరావు ఎన్నికయ్యారు స్టేట్ కో కన్వీనర్ గా నియామకమైన గుంటుపల్లి వెంకట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి గాని వ్యవహరిస్తారని కమిటీ తెలిపింది ఇన్చార్జిలతో స్టేట్ అడహక్   కమిటీని కూడా నియమించారు



లోక కళ్యాణార్థం మహాపాదయాత్ర

 లోక కళ్యాణార్థం భారత దేశ శాంతి కోసం ఈనెల 11 నుంచి 22 వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆదివారం బీర్కూరు మండల కేంద్రంలోని శ్రీ రామాలయంలో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ పాదయాత్ర 11వ తేదీన ప్రారంభమై 23వ తేదీన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సోమనాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకుంటుందన్నారు పాదయాత్రలో పాల్గొనే భక్తులకు ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళల్లో అల్పాహారం ప్రసాదం సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు పాదయాత్రలో పాల్గొనే విజయవంతం చేయాలని కోరారు



లింగంపేట మండల పి.ఎం.పి అసోసియేషన్ 2024

 లింగంపేట మండల పి.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ను ఎన్నుకున్నట్లు ఉపాధ్యక్షుడ రాజు తెలిపారు . గౌరవ అధ్యక్షుడిగా భీమ్రాజ్ ఉపాధ్యక్షుడిగా రామారావు మహిపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ కోషాధికారి రషీద్ సహాయ కార్యదర్శిగా రామకృష్ణ రాజేందర్ ముబీన్లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు