2, మార్చి 2024, శనివారం

బైక్ ట్రాలీ అదిరింది..

 ఇప్పటివరకు ఆటో ట్రాక్టర్ ట్రాలీలు చూశాము కానీ ఇప్పుడు ద్విచక్ర వాహన ట్రాలీలు వస్తున్నాయి పొలం పనులకు యూరియా బస్తాలు ఇంటి దగ్గర ఉన్న పశువులకు గడ్డి తీసుకుపోవడానికి ఉపయోగపడుతున్నాయి నిజామాబాద్ శివారు కాలూర్లో రాహుల్ అనే యువకుడు తన బైకు అనుసంధా నించి గడ్డిని తరలిస్తుండగా తీసిన ఫోటో ఇది ఈ ట్రాలీ తయారు చేయించుకోవడానికి 30 వేల రూపాయలు ఖర్చు అయిందని రాహుల్ చెప్పారు



జాతీయ లోక్ అదాలత్ వాయిదా

 జాతీయ లోక్ అదాలకు మార్చి 9 నుంచి 16వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు వివాదా పరిష్కార మార్గాలలో లోక్దాలతో ఒకటి అన్నారు అపరిష్కృత కేసులను రాజు చేసుకోవాలని సూచించారు

క్రేజీ వంకాయ

 సాధారణంగా వంకాయ వంద నుంచి 200 గ్రాముల వరకు బరువు ఉంటుంది అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో శనివారం జరిగిన వారపు సంతకు గిరిజన రైతులకు తీసుకువచ్చిన వంకాయలలో కొన్ని భారీ సైజులో ఉండి చూపర్లను ఆకట్టుకున్నాయి ఒక్కో వంకాయ కిలో నుంచి వరకు బరువు తూగాయి పరిమాణంలో ఆనపకాయను తలపించాయి