2, మార్చి 2024, శనివారం

దరఖాస్తుల గడువు పొడిగింపు

 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తుల గడువును పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా సింగపూర్ దేశాల్లోని విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు అర్హత కలిగిన వారు ఈనెల 31 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు

మూడున జిల్లాస్థాయి సైక్లింగ్ ఎంపికలు

 నిజామాబాద్ జిల్లా స్థాయి సైక్లింగ్ జట్ల ఎంపికలు ఈనెల 3 గంటలకు కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో నిర్వహిస్తున్నట్లు జిల్లా సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్రావు శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 9 10 తేదీలలో మెదక్ జిల్లాలో జరిగే ఎనిమిదవ రాష్ట్రస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లు పాల్గొంటారని తెలిపారు.

సబల సత్యభామ చింతల పోశవ్వ

 పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవాకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వాములు అవుతున్న కామారెడ్డికి చెందిన దివ్యహస్తం ట్రస్ట్ బాధ్యురాలు చింతల పోషవ్వకు సబల సత్యభామ పురస్కారం దక్కింది హైదరాబాదులో శుక్రవారం సామాజికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు సామాజిక సేవలకు గాను పురస్కారం దక్కడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గోని వెంకటేశ్వర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన కార్యక్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సబల సత్యభామ పురస్కారానికి చింతల పోషవ్వ గారు ఎంపికయ్యారు పోషవ్వ తన దివ్య హస్తం ట్రస్టు ద్వారా గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవ్ ఎన్విరాన్మెంట్ వర్క్ లో భాగంగా కౌడంగ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ నాయకురాలుగాను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను సభల సత్యభామ అవార్డును ప్రముఖ సామాజికవేత్త ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి చేతులమీదుగా తీసుకున్నారు ఆమె చేస్తున్న సేవలకు గాను పురస్కారం అందుకోవడం పట్ల పలువురు సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు అభినందనలు తెలిపారు..