4, ఫిబ్రవరి 2024, ఆదివారం

కరడ్ పల్లి గ్రామ గుడాడి రెడ్డి సంఘం 2024

 కరడ్ పల్లి గ్రామ గుడాడి రెడ్డి సంఘం నూతన కార్యవర్గమును 2024 ఎన్నుకున్నట్లు సంఘ

 అధ్యక్షులు - ఏలేటి సూర్యకాంత్ రెడ్డి తెలిపారు

 ఇందులో కార్యదర్శిగా -  నల్లబెల్లి సుభాషిరెడ్డి

 కోశాధికారిగా - ఏలేటి రాజిరెడ్డిలు 

ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రెడ్డి సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం సంఘ సభ్యులను శాలువాలతో సన్మానించారు కార్యక్రమంలో రెడ్డి సంఘ సలహాదారులు సభ్యులు పాల్గొన్నారు.



ఏ టి యు సి బాన్స్వాడ డివిజన్ కార్యవర్గం 2024

 ఏ టి యు సి డివిజన్ నూతన కార్యవర్గాన్ని పట్టణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా దుబాస్ రాములు ప్రధాన కార్యదర్శిగా శంకర్ ఉపాధ్యక్షుడిగా ధర్మ చిన్నసైలు కార్యదర్శిగా సమృద్ధి శివాజీ పలువురిని కార్యవర్గ సభ్యులుగా నియమించారు



నైపుణ్యాభివృద్ధికి కృషి

 బాన్స్వాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు విద్యార్థులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలతో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు పదార్థాలు విక్రయించగా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ప్రధాన చార్యులు నాగిరెడ్డి తెలిపారు