22, మార్చి 2026, ఆదివారం

కేసీ పుల్లయ్య ఫౌండేషన్, హైద్రాబాద్

 కేసీ పుల్లయ్య ఫౌండేషన్,

గగన్ మహల్,

హైద్రాబాద్.




ఫౌండర్ ట్రస్టీ వ్యవస్థాపకులు.. అనిల్ కుమార్ కామిశెట్టి 

సభ్యులు.. సుశీల్ కుమార్ కామిశెట్టి 

కార్య నిర్వాహక. సభ్యులు.. వాసు దేవ రావు పరిం,

సీఈఓ.. సుధా చల్ల 

గౌరవ చైర్ పర్సన్ .. కే. కృష్ణ వేనమ్మ..

LPG కి ప్రత్యామ్నాయం.. డైమిథైల్ ఈథర్

 ప్రస్తుతం LPG కి  డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో.. బిట్స్ పిలాని, హైద్రాబాద్ శాస్త్రవేత్తలు శుభ వార్త చెప్పారు.. LPG కి బదులుగా డైమిథైల్ ఈథర్ వినియోగం సాధ్యమని వెల్లడించారు..రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగాధిపతి సౌనక్ రాయ్ నాయకత్వం లో సత్య పాల్ సింగ్,రిటైర్డ్ ప్రొఫెసర్ బి ఎం రెడ్డి తదితరులు కలిసి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే ప్లూ గ్యాస్ ను ప్రయోగ శాలలో సృష్టించారు. దీనిని బై ఫంక్షనల్ పదార్థాల సహాయంతో నీటి ఎలక్ట్రాలసిస్ ద్వారా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ తో కలిపి డైమిథైల్ ఈథర్ గా మార్చే టెక్నాలజీ ను అభివృద్ధి చేశారు.. LPG తో పోలిస్తే DME కాలుష్య కారకాలు తక్కువగా విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు..

మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం

 


ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ కార్యవర్గాన్ని ఆదివారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఏక గ్రీవ్రంగా ఎన్నుకున్నారు .

2026 సంవత్సరానికి గాను 

అధ్యక్షుడిగా ..ముప్పారం శివకుమార్

 కార్యదర్శిగా..  కత్రాజీ చిన్న గంగాధర్,

 గ్రామ అభివృద్ధి కమిటీకి.. శృంగారం మోహన్ లను ఎన్నుకొని సన్మానించారు.

కొన్నేళ్లుగా ఆలయ నిర్మాణం కోసం పాటు పడిన ప్రణీత్, విశాల్ లను సైతం సన్మానించారు.కార్యక్రమంలో గౌరవ సలహా దారుడు చిన్నారెడ్డి,తిరుపతి, సాయి రామ్,శ్రీనివాస్ తిరుమలేశ్,సాగర్, మనీష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు..