27, మార్చి 2024, బుధవారం

గర్భాశయ క్యాన్సర్ ను పసిగట్టే స్మార్ట్ స్కోప్

 సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే పసికట్టే సంస్థ స్మార్ట్ స్కోప్ అనే డిజిటల్ డివైస్ ను రూపొందించింది పూణేలోని పెరివింకిల్ టెక్నాలజీస

మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో స్మార్ట్ స్కోప్ కీలకపాత్ర పోషిస్తుంది యూఎస్ యూకే లలో పని చేసిన వీణ మోక్తాలి ఆమె భర్త కౌస్తుబు నాయకులు మన దేశానికి వచ్చి పూణే కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు ఈ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ స్కోప్ డిజిటల్ డివైస్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వద్ద పద్ధతులు సమయం తీసుకుంటున్నాయి ఈ సౌకర్యాలు పెద్ద నకర నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఫలితంగా ఎక్కువ మంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు అంటున్నారు వీణ ఈ నేపథ్యంలో స్మార్ట్ స్కోప్ అనేది చిన్న ప్రైవేటు క్లినిక్ నర్సింగ్ హోమ్స్ మున్సిపల్ డిస్పెన్సరీలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ జిల్లా ఆసుపత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు ఒక బ్యాంకు మేనేజర్ కు గ్రేడ్ 2 దశలో క్యాన్సర్ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు ఈ డివైస్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరొక సానుకూల అంశము కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణం చేసే టైం గ్రామీణ మహిళలకు ఉండడం లేదు స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అంటుంది వీణ అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలని లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది వీణ మొక్తాలి



ఆధ్యాత్మిక సమాచారం 27 మార్చి 24

 హనుమాన్ ఆలయానికి విరాళం అందజేత

పిట్ల మండలంలోని అల్లాపూర్ గ్రామ హనుమాన్ ఆలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం ఆధ్వర్యంలో 21 వేల విలువ గల జ్యోతి దీపారాధన హుండీని ఆలయ నిర్వాహకులకు విరాళంగా అందజేశారు అంతకుముందు హనుమాన్ సైన్యం సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో హనుమాన్ సైన్యం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విటల్ కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేంద్రరావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మహిపాల్ రెడ్డి కాంతరెడ్డి హనుమంత్ రెడ్డి మల్లుగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నారు

30 నుంచి సిద్ధ రామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

దక్షిణ కాశీగా పేరుందిన బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలోని స్వామివారి బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు కామారెడ్డి బస్టాండ్ నుంచి ప్రతి గంటకు ఆర్టిసి బస్సులు ఆలయానికి వస్తాయన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు

మైలారం గ్రామంలో గల కొచ్చేరి మైసమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొన్నది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టినవేద్యాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు

పెద్దకూడాప్గల్ మండల కేంద్రంలోని పాప హరేశ్వర ఆలయంలో పురోహితులు శ్రీపతిరావు పంతులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపతిరావు మాట్లాడుతూ శిఖర ప్రతిష్టాపనలో భాగంగా గోవు పూజ అగ్ని ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పారు బుధవారం జరగబోయే కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు





సెంచరీ కొట్టాలంటే

 వయసు సెంచరీ కొట్టాలంటే ఏజ్ 50 దాటాక కొన్ని ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అలవాటు అయిన ఆహార నియమాలే కొనసాగిస్తానంటే 60లోనే ఆసుపత్రి పాలు కావలసి వస్తుంది 70 దాటకుండానే రన్ అవుట్ అయ్యే ప్రమాదము ఉంది 50 ఏళ్లు దాటాక జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది శరీర పోషక అవసరాలు మారుతుంటాయి మరి వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం ఎంతైనా మంచిది కానీ ఏమిటంటే

వేపుళ్ళు వద్దు ..

వయసులో హాఫ్ సెంచరీ కొట్టాక రోజువారి ఆహారంలో వేపుల్ల కోసం వేయించుకు తినడం మానేయవలసిందే పండుగకు పబ్బానుకో రుచి చూడొచ్చు కానీ ప్రతిరోజు కరకరలాడే వేపుళ్ళు తింటే ప్రమాదమే వాటిలో ఉండే నూనె శరీరానికి మంచిది కాదు పైగా పొట్టలో కొలెస్ట్రాల్ కూడా పేరుకు పోతుంది అంతగా తినాలి అనుకుంటే ఎయిర్ ప్రైర్ లో గాని ఓవెన్ లో గాని తయారు చేసుకుంటే కాస్త మంచిది

చక్కెరకు చెక్

జ్యూస్ గ్రీన్ టీ బలవర్ధకం లాంటి లేబుల్స్ చూసి అవి ఆరోగ్యవంతమైనవి అనుకొని మోసపోతుంటాము నిజానికి చూడాల్సింది అందులోనే చక్కెర శాతం అవి నడివయసుకు మంచిది కావు చక్కెరకు చెక్క పెడితే కానీ కొలెస్ట్రాలకు కామ పడదు.

చాపల్యం చాలు

50 ఏళ్లు వచ్చేవరకు ఆస్వాదించిన రుచులు చాలు జిహ్వచాపలి అని ఎంత వదులుకుంటే అంత ఆరోగ్యం ప్రజల కోసం ప్యాకేజ్డ్ ఫుడ్ కు అలవాటు పడితే చేటు తప్పదు వీటిలో కనిపించకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది దీనిని హిడెన్ షుగర్ అంటారు వీటి బదులు తాజా పండ్లు తినడం మంచిది

మందుకు నో

 వయసు పెరుగుతున్న కొద్దీ మద్యం వల్లే కలిగే దుష్ఫలితాలు పెరుగుతాయి మద్యంతో కాలేయం మీద ఒత్తిడి పెరుగుతుంది 50వ పుట్టినరోజు నాడు డ్రింకింగ్ హ్యాబిట్ కు స్వస్తి పలకండి

ఉప్పు ముప్పు

రోజువారి ఆహారంలో 200300 మిల్లి గ్రాములకు మించి ఉప్పు ఉండకూడదు అన్నది నిపుణుల మాట కానీ మనం అంతకు ఎన్నో రేట్లు లాగించేస్తుంటాము నడివయసులో వచ్చే అధిక రక్తపోటు లాంటి సమస్యలను ఉప్పు తీవ్రతరం చేస్తుంది వీలైనంతవరకు ఉప్పు తగ్గించడం మధ్య అవసరం అని గుర్తించండ