27, మార్చి 2024, బుధవారం

హనుమాన్ సైన్యం సామాగ్రి అందజేత

 పిట్ల మండలంలోని అల్లాపూర్ హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన హనుమాన్ సైన్యం సంఘ సభ్యులు మంగళవారం 21 వేల రూపాయల విలువ చేసి జ్యోతి హుండీ ఇతర సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేశామని చెప్పారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పరువయ్య ఉపాధ్యక్షుడు సాయి సుధీర్ ప్రధాన కార్యదర్శి విఠల కోశాధికారి శంకర్ సభ్యులు సాయి రెడ్డి సురేందర్రావు బాలాజీ రావు సాయిరాం సంతోష్ రెడ్డి మైపాల్ రెడ్డి కాంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి మలిగొండ బసేందర్ పండరి రావు తదితరులు పాల్గొన్నార



దరఖాస్తు చేసుకోవాలి

 తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాదులోని శిక్షణ కేంద్రంలో యుపిఎస్సి సి షాట్ 2024 25 సంవత్సరానికి గాను ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు 100 మంది డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ బుద్దిస్ట్ పార్శి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు అభ్యర్థులు www.tmreistelangana.cgg.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఏప్రిల్ 28న ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాల కామారెడ్డిలో హైదరాబాద్ వారిచే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిపారు మరిన్ని వివరాలకు 04023236112 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు

27 నుంచి అఖండ హరినామ సప్తాహం

 పాత బాన్సువాడ శాంతినగర్ కాలనీలోని రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి ఏడు రోజుల పాటు అఖండ హరినామ సప్తాహం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు