25, మార్చి 2024, సోమవారం

వాహనదారుల సమస్యలకు పరిష్కారం 88103 31033

 హైవే మార్గంపై వెళ్లే వాహనదారుల సమస్యలు తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు స్వచ్ఛత టోల్ ప్లాజా పేరిట హైవే అథారిటీ అధికారులు 8810331033 వాట్స్అప్ నెంబర్ను అందుబాటులో ఉంచారు రోడ్డు ప్రమాదాలు జరిగిన మరుగుదొడ్లు మూత్రశాలలో అపరిశుభ్రంగా ఉన్న తాగునీటి సమస్య దీపాలు వెలగకపోయినా ఇలా సమస్య ఏదైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని సందేశం పంపిస్తే సంబంధిత అధికారులు ఆప్షన్లు పంపిస్తారు సమస్య ఉన్న ఫోటోలు అప్లోడ్ చేస్తే వెంటనే స్పందిస్తారు

దివ్యాంగులకు వ్యాపార చేయూత

 ఉమ్మడి జిల్లాకు 63 యూనిట్లు మంజూరు

దివ్యాంగులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఆర్థిక చేయూత అందించి చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది స్వయం ఉపాధి అవకాశాల కోసం రాయితీ రుణాలు అందించేందుకు సిద్ధమైంది అందులో భాగంగా 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50వేల రూపాయల నుంచి 3 లక్షల వరకు రాయితీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటుంది

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు 63 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది 50 వేల రుణాలకు 100% రాయితీ లక్షకు 80 శాతం రెండు లక్షలకు 70% మూడు లక్షలకు 60% చొప్పున రాయితీ రుణాలను అందించనున్నది డబ్బులు పొందిన వారు కిరాణం బట్టల దుకాణం కూరగాయల విక్రం తదితర వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదగాలి

 త్వరలోనే అర్హుల ఎంపిక

యూనిట్ల అందించేందుకు అర్హులైన దివ్యాంగుల ఎంపికను త్వరలోనే చేపట్టనున్నారు ఎందుకు మండల కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన దరఖాస్తులను స్కూటీని చేసి జిల్లా స్థాయిలో అందిస్తారు జిల్లా కమిటీ అర్హుల నుంచి ఒకరిని ఎంపిక చేస్తుంది అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తారు మంజూరైన రుణాలతో లబ్ధిదారులు ఏ యూనిటీ నెలకొల్పారు వాటి చిత్రాలతో సహా రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు

రైతు రుణాలు పొంది ఆర్థికంగా ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది జిల్లాకు 35 యూనిట్లు మంజూరయ్యాయి వాటికి సంబంధించి అర్హులను ఎంపిక చేసే పనిని త్వరలో పూర్తి చేస్తాము రుణాలను సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి నిజామాబాద్ గారు తెలిపారు నిజామాబాద్కు 35 యూనిట్లు కామారెడ్డి జిల్లాకు 28 యూనిట్లు మంజూరయ్యాయి

ఇందూరులో రాజస్థాన్ మట్టి పాత్రలు

 ఎండలు మండుతున్నాయి కాస్త బయట తిరిగి వస్తే వెంటనే చల్లని నీరు తాగాలనిపిస్తుంది ప్రజల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరలకే మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేస్తున్నారు ముఖ్యంగా రాజస్థాన్ నుంచి తెచ్చిన వివిధ మట్టి పాత్రలు నగరవాసులను అకట్టుకుంటున్నాయి ప్లాస్టిక్ బాటిల్లకు ఏ మాత్రం తీసుకోకుండా వీటిని తయారు చేశారు కంచం గ్లాసు టీ తాగే కప్పులు ముగ్గురు కూరలు వండి మట్టి గిన్నెలు వాటర్ ఫిల్టర్లు ఇలా అన్ని మట్టితో చేసినవే కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజల ఆసక్తి చూపుతున్నారు