18, మార్చి 2024, సోమవారం

రక్తహీనత రాకుండా

 శరీరానికి కీలక పోషకాలు ఖనిజాలు అందించడంలో బీట్రూట్ మేటి కానీ దీన్ని తినడానికి మాత్రం చాలా మంది ఇష్టపడరు

మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య రక్తహీనత ఈ ముక్తిని తగ్గించుకోవాలంటే ఐరన్ పోషక ఒంట్లో పుష్కలంగా ఉండాలి అది బీట్రూట్ నుంచి తగినంతగా అందుతుంది దీనిని కూర సలాడ్ ఇలా ఏ రూపంలో తీసుకున్న హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది బీట్రూట్లో ఉండే నైట్రేట్ నిల్వలు నైట్రేట్ ఆక్సైడ్ గా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి ఫలితంగా రక్తనాళాల్లో గడ్డకట్టే సమస్య అదుపులో ఉంటుంది

ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కమిటీ ఎన్నిక

 తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గా ఎస్ బాబు ఈదురు వెంకన్న ఎన్నికయ్యారు ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఈయూ రాష్ట్ర మహాసభలో ఆదివారం వచ్చాయి ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహన సమితి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షుడిగాకే పద్మాకర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎండి అహ్మద్ అలీ ఉపాధ్యక్షులుగా ఎం వెంకట్ గౌడ్ ఉప ప్రధాన కార్యదర్శిగా పాటి అప్పారావు జే రాఘవ ప్రచార కార్యదర్శిగా శ్రీ శంకర్ కోశాధికారిగా జీడీ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొత్తం 36 మందితో రాష్ట్ర కార్యనిర్వాహన సమితిని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు బాబు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన కమిటీ పని చేస్తుంది అన్నారు 95 డిపోల నుంచి 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారు



మనిషిలో సుఖదుఃఖాలు సహజం

 మనిషి జీవితంలో దుఃఖం బాధలు అనివార్యమైనవిగా గుర్తించి వాటిని అధిగమించడానికి ఆధ్యాత్మిక భావన జ్ఞానం యోగ జ్ఞానం శారీరక శ్రమతో మానసిక ప్రశాంతత పొందాలని ఆచార్య సత్యమిత్ర ఆర్య అన్నారు స్థానిక సిరిసిల్ల రోడ్డులోని శ్రీకృష్ణ గీతా మందిరం వార్షికోత్సవం సందర్భంగా రెండో రోజు ఆదివారం సాయంత్రం ఆచార్య సత్యమిత్ర ఆర్య ఉపనిషత్తుల సారం ప్రవచనం చేశారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గీతా మందిరం ప్రతినిధులు పాత అశోక్ పార్శి రాజేందర్ తదితరులు ఉన్నారు