18, మార్చి 2024, సోమవారం

వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

 





బీర్కూరు మండలం తిమ్మాపూర్ లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నవమి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు పోచారం కుటుంబ సభ్యులు స్వామి కళ్యాణం కు హాజరయ్యారు



సరస్వతి మాత ఆలయంలో పూజలు

 కామారెడ్డి మండలం ఇలిచిపూర్ లోని సరస్వతి మాతా ఆలయాన్ని అధికారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ దంపతు దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకుడు ఆంజనేయ శర్మ మాజీ సర్పంచ్ సితా గౌడ్ నాయకులు పార్సిల్ పటేల్ నారాయణరెడ్డి మహేష్ ధనుంజయ రెడ్డి సోమలింగం తదితరులు పాల్గొన్నార



విద్యార్థులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

 పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మే కరీం ఒక ప్రకటనలో తెలిపారు పరీక్షలు అంటే భయం మానసిక ఒత్తిడి ఆందోళన ప్రిపరేషన్ లోపాలు జ్ఞాపకశక్తి ఏకాగ్రత సబ్జెక్టు పై శ్రద్ధ లేకపోవడం చదివేటప్పుడు నిద్ర రావడం విసుగ్గా ఉండడం తదితర సమస్యలు ఉన్నవారు రోజు సాయంత్రం నాలుగు నుంచి 8 గంటల వరకు 9440488571 మరియు 04035717915 నెంబర్లలో సంప్రదించాలని అన్నారు