10, మార్చి 2024, ఆదివారం

హనుమాన్ చాలీసా పారాయణము

  కామారెడ్డి గంజ్ వర్తక సంఘం భవనంలోని హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుంచి అరగంట పాటు జరిగే సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని పాల్గొనవచ్చు అని ప్రతినిధి ఎలంకె సుదర్శన అన్నారు

తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానము

 భక్తి మార్గంలో నడవాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు





తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానమని తల్లిదండ్రుల సేవ చేస్తే వేయి జన్మల పుణ్యం వస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు శివరాత్రి పండుగ సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మఠం శుక్రవారం రాత్రి జాగరణ శనివారం రోజున పలు గ్రామాలలోని శివాలయాలలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాగరణ ప్రవచనా కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు దేవుడిని అనుగ్రహం లేనిది ఈ కార్యము జరగదని అన్నారు ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవాటు చేసుకుని దైవ కార్యాల్లో భక్తిశ్రద్ధతో పాల్గొనాలన్నారు దేవాలయాల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు ఆధ్యాత్మికంగా యువత ముందుకు వెళ్లాలన్నారు కాశీ విశ్వనాథ మఠాధిపతి సోమయ్యప్ప స్వామిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు


ఘనంగా రథోత్సవం

 దోమకొండ మండల కేంద్రంలోని శివరామ మందిరంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు ఉమామహేశ్వరులు సీతారాముల రథాలతో శోభాయాత్ర నిర్వహించారు భక్తులు వ్రతాలను బస్టాండ్ వరకు లాగారు అనంతరం మహారాష్ట్ర బృందం లంకా దహనం కార్యక్రమాన్ని నిర్వహించింది దోమకొండ తో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన వేలాదిమంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు అభ్రమైన రాజు డైరెక్టర్లు చెన్నం రవి బత్తిని సిద్ధరాములు అర్చకులు భవి కృష్ణమూర్తి శర్మ జన్మంచి రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు