9, మార్చి 2024, శనివారం

అమ్మ ప్రేమ అమృతం

 నా వయసు 30 సంవత్సరాలు కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను పాపకు నాలుగు నెలలు నిండాయి మిటర్నిటీ లీవ్ కాలపరిమితి ముగియడంతో తిరిగి విధులలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది పాప బాగోగులు చూసుకునేందుకు మా అత్తగారు వచ్చారు ఆమె వయసులో పెద్దవిడ పిల్లల పెంపకంలో అనుభవం ఉన్నప్పటికీ నాకు కంగారుగానే ఉంది పాప నన్ను మిస్ అవుతుందని తనతో ఎక్కువ సమయం గడపకపోతే నాకు దగ్గర అవ్వదేమో అని భయంగా ఉంది ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారు



మాతృత్వ మాధుర్యం అనుభూతి చెందుతున్న ప్రతి అమ్మలోనూ ఇలాంటి అనుమానాలు రేకెత్తడం సహజం నాలుగు నెలలుగా పాపతోనే ఉండడం వలన తనను వదిలి ఆఫీసుకు వెళ్లడానికి మీకు ధైర్యం సరిపోవడం లేదు మీ అత్తగారు బాగా చూసుకుంటారని తెలిసిన బుజ్జాయిని వదిలి ఉండడానికి మీ అంతరాత్మ అంగీకరించడం లేదు ముఖ్యమైన విషయం ఏమిటంటే పొద్దంతా తన దగ్గర లేకపోతే చిన్నారి మీకు దూరం అవుతుందన్నది కేవలం మీ అపోహ మాత్రమే పాపతో మీది రక్తసంబంధం ఒక పూట దగ్గర లేనంత మాత్రాన ఏదో జరిగిపోతుందని కంగారు పడవద్దు ఎవరు ఎంత దగ్గర చేసినా అమ్మ ఆప్యాయతను మించింది ఉండదు అవకాశం ఉంటే ₹10,000 తగ్గించుకొని ప్రయత్నం చేయండి కొన్నాళ్లు రిమోట్ వర్క్ కానీ హైబ్రిడ్ వర్క్ ఆప్షన్ కానీ ఇవ్వమని కోరండి అందుకు అవకాశం లేకపోతే మీ ఆఫీసుకు దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రయాణ సమయం కూడా కలిసి వస్తుంది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి ఇంట్లో ఉన్న సమయం పాపతో గడపడానికి ప్రాధాన్యం ఇవ్వండి పాపకు ఏడాది వయసు వచ్చేదాకా అందుబాటులో ఉన్న సెలవులను వాడుకోండి


డ్రై ఐ స్ ముట్టుకుంటే ముప్పే

 డ్రై ఐస్ అంటే ఏమిటి డ్రై అయిస్ నిన్న మొన్న వార్తలు హల్చల్ చేసిన ఉత్పత్తి గురుగ్రామ్ కు చెందిన ఒక రెస్టారెంట్లో భోజనానంతరం డెసర్ట్ అనుకుని ఈ డ్రై ఐస్ నోట్లో వేసుకున్న ఐదుగురు తీవ్రమైన ఆస్వస్థతకు గురవ్వడమే ఇన్దుకు కారణం. రక్తపు వాంతులతో వారు భయభ్రాంతులైపోయారు ఇంతకీ ఏమిటి డ్రై అయిస్ కార్బన్డయాక్సైడ్ ను దాదాపు 80 డిగ్రీల దగ్గర చల్లబరిచినప్పుడు ఈ డ్రై ఐస్ ఏర్పడుతుంది ఐస్ క్రీమ్ లాంటివి కరిగిపోకుండా ఉండేందుకు దీనిని వాడతారు పొరపాటున దీనిని నోట్లో వేసుకుంటే ఒంట్లోని ఆక్సిజన్ ని ఆవిరి చేసేస్తుంది నోరు జీర్ణాశయం ఇలా డ్రై అయిస్ ప్రయాణించే మార్గం అంతా దెబ్బతింటుంది చర్మానికి తగిలితే కాలిపోయినంతగా బాధిస్తుంది దాని ఆవిరి తగిలినా కూడా దద్దుర్లు కళ్ల మంటలు కాయం సరదాగా అయినా ఈ డ్రై ఐస్ చోలికి పోవద్దన్నది వైద్యుల హెచ్చరిక వృత్తిపరంగా ఈ ఉత్పత్తికి దగ్గరగా ఉండాల్సి వస్తే నిపుణుల సూచనలను తప్పకుండా పాటించాలి చేతులకు గ్లౌజ్ కళ్ళకు గాగుల్స్ లేకుండా పొరపాటున కూడా దీనిని తాకకూడదు

భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి

 








శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఓం నమశ్శివాయ నమ స్మరణతో మార్మోగిన ఆలయాలు పూజల అనంతరం ఉపవాస దీక్షలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు జిల్లాలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిరికిటలాడాయి శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టారు అభిషేకాలు పూజలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు శివలింగాలకు భక్తులు పూజలు చేశారు పలు ఆలయాలలో వేద పండితుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం చేపట్టారు ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సతీమణి పుష్ప డిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు












 మద్దికుంటలోని బుగ్గ రామేశ్వరాలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి నాయకుడు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఎల్లారెడ్డి లోని నీలకంఠేశ్వరాలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు పూజలు చేశారు నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ త్రిలింగేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజలలో కలెక్టర్ జితేష్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నార