7, మార్చి 2024, గురువారం

దర్జీల నూతన కార్యవర్గం 2024 ఎన్నిక



 ధర్పల్లి మండల కేంద్రంలో దర్జీల నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీలు 

అధ్యక్షునిగా వెంగళ లింబాద్రి 

ఏకగ్రీవంగా ఎన్నికగా 

ఉపాధ్యక్షులుగా బైరి అనిల్

 కార్యదర్శిగా ఎల్లారం భాస్కర్

 కోశాధికారిగా కోటూరు శ్రీనివాస్

 సలహాదారులుగా క్యాదరి శ్రీధర్ దాసరి గంగాధర్ తాళ్ళకృష్ణలు ఎన్నికయ్యారు 

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లింబాద్రి మాట్లాడుతూ మార్కెట్లోకి రెడీమేడ్ దుస్తుల కంపెనీలు విచ్చలవిడిగా రావడంతో దర్జీలు జీవనోపాధి కోల్పోయే వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆ విధంగా చేశారు ప్రభుత్వము ఎమ్మెల్యే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు తర్జీల కొరకు గ్రామంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని కోరారు దర్జీలకు వడ్డీ రైతు రుణాలు అందించి పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు


అతడు మళ్ళీ బొమ్మలు వేయొచ్చు

 రైలు ప్రమాద బాధిత పెయింటర్కు మహిళ చేతులు ఢిల్లీలోని శ్రీ గంగారం ఆసుపత్రి ఘనత

రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఒక పెయింటర్కు ఢిల్లీలోని శ్రీ గంగారాం హాస్పిటల్ వైద్య బృందం కొత్త జీవితాన్ని ప్రసాదించింది శాస్త్ర చికిత్స ద్వారా ఒక మహిళ చేతులను విజయవంతంగా అమర్చింది ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన రాజకుమార్ 45 ఏళ్ల వయసు పెయింటర్ గా పనిచేసేవాడు 2020లో సైకిల్ పై రైల్వే పట్టాలు దాటుతుండగా అదుపుతప్పి పడిపోయాడు అదే సమయంలో రైలు దూసుకు రావడంతో రెండు చేతులు తెగిపడ్డాయి అతడికి కృత్రిమ చేతులను వినియోగించడం కూడా సాధ్యపడలేదు శ్రీ గంగారాం హాస్పిటల్కు 2023 ఫిబ్రవరిలో చేతుల మార్పిడి శస్త్ర చికిత్సకు అనుమతుల్లభించాయి రాజకుమార్ గురించి తెలుసుకున్న వైద్య బృందం అతడికి చేతుల మార్పిడి సాధ్యాసాధ్యులపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తూ రిటైర్ అయిన ఒక మహిళ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో ఆ మహిళ చేతులను జనవరి 19న రాజ్ కుమార్ కు విజయవంతంగా మార్చారు ప్రస్తుతం అతడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చేతులను వేళ్లను కదిలించగలుగుతున్నాడని పైతీలు ఒక ప్రకటనలో వెల్లడించారు దీంతో మళ్ళీ అతడి జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి గురువారం అతడిని డిశ్చార్జ్ చేయనున్నారు ఇటీవల ఎడమ చేతిని కోల్పోయిన ఒక వ్యక్తికి హర్యానాలోని అమృత ఆసుపత్రిలో సర్జరీ చేసి మరొకరి అవయవాన్ని అతికించారు



45 రోజులపాటు శిక్షణ

 రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షకు ఉచిత శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తిగల మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు 45 రోజుల కలపరమిచ్చితో శిక్షణ ఉంటుందని ఈనెల 20 లోపు దరఖాస్తులను మహమ్మదీ బజార్ లోని ఉర్దూ అకాడమీలో సమర్పించాలని అన్నారు వివరాలకు మొబైల్ నెంబర్లు 9948956994 9700351786లలో సంప్రదించాలని సూచించారు