6, మార్చి 2024, బుధవారం

శుభ్రతలో కింగ్ బేకింగ్ సోడా

 


బేకింగ్ సోడా చాలా ఇళ్లలో ఉండేది మైసూర్ బజ్జీలు పొంగడానికి బిస్కెట్ల తయారీలో ఎక్కువగా వాడే ఈ బేకింగ్ సోడాతో చాలా ఉపయోగాలు ఉన్నాయి 

ఫ్లవర్ వాజ్లో నీరు పోసి ఒకటే స్పూన్ బేకింగ్ సోడా వేసి అందులో పూలను కాడలతో ఉంచితే అవి తాజాగా ఉంటాయి నీటి నుంచి నిలువ వాసన కూడా రాదు. 

వంట పాత్రల్లో వేడినీరు పోసి అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి కాసేపు నానబెట్టి కడిగితే పాత్రలు మురికి పోయి తల తలలాడతాయి 

పాత్రలకు ఉళ్లి వెల్లుల్లి లాంటి పదార్థాల వాసన పోవాలంటే బేకింగ్ సోడాతో రుద్దితే సరి 

బేకింగ్ సోడాను తడిచేసి ఆ పేస్టు తో ఫ్రిడ్జ్ ని తుడిస్తే లోపల ఉన్న దుర్వాసన పోతుంది ఒక చిన్న గిన్నెలో ఈ పేస్టును ఫ్రిజ్లో ఉంచితే చెడు వాసన ఏర్పడదు 

బేకింగ్ సోడా కలిపిన నీటితో పనులు కూరగాయలను కడిగితే వాటి మీద ఉండే రసాయనాలు మురికి పోతాయి

ఐదు నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు

 వైద్య సాంకేతిక రంగంలో ఏఐజీ మరో విప్లవం తవాకరణ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి బృందం వెల్లడి

వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటర్రాలజీ ఏఐజి దవాఖాన మరో విప్లవం సృష్టించింది ఆసియా పసిఫిక్ లోనే తొలిసారిగా వివాస్కోప్ అనే సరికొత్త ఇన్స్టంట్ పెథాలజీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సాధారణంగా బయాప్సీ ఫలితాలు రావాలంటే కనీసం ఐదు రోజుల సమయం పడుతుంది కానీ వీవాస్కోపు పద్ధతి ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు తెలుసుకోవచ్చని ఏఐజి దావాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు వివాస్కోప్ ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడారు వివాస్కోప్ ద్వారా బయాప్సీ ఫలితాలను కేవలం ఐదు నిమిషాల్లోనే తెలుసుకోవచ్చని దీని వలన సరైన సమయంలో రోగ నిర్ధారణ జరిపి రోగికి సకాలంలో చికిత్స అందించే వీలు ఉంటుందని తెలిపారు జిఐ క్యాన్సర్ కు సంబంధించిన అత్య వసర పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో ఈ పద్ధతి కీలకపాత్ర పోషిస్తుంది అని తెలిపారు డైరెక్టర్ డాక్టర్ జివి రావు పేతాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ వివాస్కోపు పద్ధతి వైద్యరంగంలో కొత్త శకాన్ని నిర్వహిస్తుందని వేగవంతమైన బయాప్సీ ఫలితాలతో స్పష్టమైన వ్యాధినిర్ధారణ ఆపరేషన్ థియేటర్లోనే చికిత్స ప్రణాళికపై నిర్ణయం తీసుకునేలా వైద్యులకు తగిన సమాచారం అందుతుందని చెప్పారు



శ్వాసతో షుగర్ టెస్ట్

 ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ డయాబెటిస్ బారిన పడుతున్నారు అయితే షుగర్ స్థాయిలను గుర్తించాలంటే చిరంజీవి ద్వారా రక్తం తీసి గ్లూకోమీటర్ తో పరీక్షించాల్సిందే రక్తాన్ని సేకరించే అవసరం లేకుండా కేవలం శ్వాసతో చక్కెర స్థాయిలని తెలిపే పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని ఐఐటి మండే శాస్త్రవేత్తలు తయారు చేశారు మొదటగా వేరు తయారు చేసిన పరికరంలో మనం శ్వాసను ఉండాలి ఆ తర్వాత పరికరం షుగర్ స్థాయితో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయి బీపీ వివరాలను కూడా అందజేస్తుందని పరిశోధకులు చెప్పారు