3, మార్చి 2024, ఆదివారం

పీ ఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం

 తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రంగారెడ్డి 2024 

నూతన అధ్యక్షుడిగా.. జి అశోక్ రెడ్డి

 ప్రధాన కార్యదర్శిగా ..వి సుధీర్ కుమార్ ఎన్నికయ్యారు

రంగారెడ్డి జెడ్పి కార్యాలయంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు

 ఉపాధ్యక్షుడిగా.. డి గంగాధర్, ఎస్ రామకృష్ణ 

సహాయ కార్యదర్శిలు.. ఎంబి రేణుక, ఎం బెన్నీ దీపక్

 కోశాధికారి.. బి శ్రీమతి

 టెక్నికల్ సెక్రటరీ.. ఏ సుమతి 

ఆర్గనైజింగ్ సెక్రెటరీ.. జి.శ్రీరామ్ 

జోనల్ సెక్రెటరీ జోన్ 6 గా.. పి మంజులను 

ఎన్నుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రం కోరుతూ సమావేశంలో తీర్మానించినట్టు నూతన అధ్యక్షుడు అశోక్ రెడ్డి తెలిపారు

నా భర్త బెట్టింగ్ మానాలి

 సమ్మక్క భక్తురాలు విచిత్ర కోరిక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీలలో భక్తుల విచిత్ర కోరికల చిట్టీలు బయటపడుతున్నాయి నా భర్త బెట్టింగ్ మానివేయాలి అక్క కొడుకుకు ఐఐటీలో సీటు రావాలి అని ఒక భక్తురాలు రాసిన కాగితం హుండీ లెక్కింపులో ఆదివారం బయటపడింది కోరిన కోరికలు తీర్చే తల్లి కోరిక తీరుస్తుందో లేదో చూడాలి మరి



నర్సంపేటలో కశ్మీర్ యాపిల్

 వరంగల్ జిల్లా నర్సంపేటలో కాశ్మీర్ యాపిల్ కాసింది వాన ప్రేమికుడు గోక రామస్వామి తన శాంతివనంలో రకరకాల పూలు పండ్ల మొక్కలు పెంచుతుంటారు ఆరేండ్ల క్రితం కాశ్మీర్ వెళ్లినప్పుడు యాపిల్ మొక్కను తీసుకొచ్చారు ఇక్కడ వాతావరణం లో యాపిల్ మొక్కలు పెరగవని చాలామంది చెప్పిన ధైర్యం చేసి పెంచారు ఇప్పుడా మొక్క విరుగ కాసింది